English   

విజయ్ మంత్రం ఫలిస్తుందా..?

vijay devarakonda
2018-02-28 11:37:58

విజయ్ దేవరకొండ.. ఈ పేరుకంటే అర్జున్ రెడ్డి అంటే ఎక్కువగా గుర్తుపడతారిప్పుడు. అర్జున్ రెడ్డితో ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. పెళ్లి చూపులు హిట్ తో వెలుగులోకి వచ్చి అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తో యూత్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆఫర్స్ వర్షంలో తడిసిపోయాడు విజయ్. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నాడిప్పుడు. కానీ కెరీర్ మొదట్లో ఒప్పుకున్న ఓ సినిమా ఇప్పుడు విడుదల కాబోతోంది. అదే ఏ మంత్రం వేశావె. ఈ మూవీలో అతని లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటిలా కాకుండా ఇంకా చిన్నతనం కనిపిస్తోంది. గోలీసోడా ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని ఈ మార్చిలోనే విడుదల చేయబోతున్నారు. ఇన్నాళ్లూ విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు విజయ్ కు క్రేజ్ రావడంతో దీనికి రెక్కలొచ్చాయి. ఆల్రెడీ ఈ మూవీలోని ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు మరో పాట విడుదల చేయబోతున్నారు. శ్రీధర్ మర్రి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం విజయ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అనే క్యూరియాసిటీలో ఉన్నారు.

నిజానికి ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నాడు. అతన్ని నమ్మి బడ్జెట్ నూ పెంచుతున్నారు చాలామంది నిర్మాతలు. ఇలాంటి టైమ్ లో ఈ మూవీ రావడం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందా అనే టెన్షన్ లో అతను కూడా ఉన్నట్టు టాక్. ఇక ఈ సమ్మర్ లోనే విజయ నటించిన మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి. వాటిలో టాక్సీవాలా ఒకటి. టాక్సీవాలా మే 18న విడుదల కాబోతోంది. మొత్తంగా ఏ మంత్రంవేశావె అంటూ వస్తోన్న విజయ్ కి ఈ మంత్రం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.. 

More Related Stories