English   

ఓరి వీళ్ల రొమాన్సో...?

Vijay-Deverakonda
2018-06-21 20:28:27

కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు భలే ఆకట్టుకుంటున్నారు. ఈ అందరిలో ఇప్పుడుటాలీవుడ్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోన్న కుర్రాడు విజయ్ దేవరకొండ. అందగాడే కాదు.. అద్భుతమైన ప్రతిభావంతుడు కూడా అయిన విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే కాదు.. ఏకంగా తమిళ్ లో కూడా డెబ్యూ ఇస్తున్నాడు. అక్కడ నోటా అనే సినిమా చేస్తున్నాడు. ఇవి కాక తెలుగులో చేసిన టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీత గోవిందం అనే సినిమా చేయబోతున్నాడు. అలాగే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ కి లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ విషయంలో మనోడు ఓ హీరోయిన్ తో ట్విట్టర్ లోనే తెగ రొమాన్స్ చేసేస్తున్నాడు.. అటు ఆ పిల్ల కూడా ఏ మాత్రం తగ్గకుండా మనోడికి చురకలు వేస్తూ.. మొత్తంగా ట్విట్టర్ లోనే విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు.

విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్నా.. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఛలోతో విపరీతంగా ఆకట్టుకున్న ఈ భామలో సెన్సాఫ్ హ్యూమర్ కూడా బానే ఉన్నట్టుంది. అందుకే విజయ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ట్విట్టర్ లోనే ‘‘బెస్ట్ యాక్టర్ అంటగా కంగ్రాట్స్ గోవిందం’ అంది. దీనికి అతను ‘దీందేముంది గీత మేడం.. అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి.. మీతో టైమ్ స్పెండ్ చేయడమే నాకు నిజమైన అవార్డ్’అన్నాడు.. 

వెంటనే రష్మిక.. ‘ ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకుంటే మంచిది.. అసలు నీకు కాదు.. ప్రభాస్ కో, తారక్ కో వస్తే బావుండేది అవార్డ్.. మాకీ గొడవుండేది కాదు’అనేసింది.. మరి మనోడు ఊరుకుంటాడా.. ‘‘అవార్డ్ దేముంది మేడం.. మీలాంటి వాళ్లు నన్ను ప్రేమిస్తే చాలు. గీతమేడం’ అని ట్వీటాడు. ‘నా లాంటి వాళ్లా? వాళ్లు ఏంటి? ఆ బహువచనం ఏంటి? తెలుసులే నీ గురించి, ఒకరు సరిపోరు, ఎవరినీ వదలవుగా’ అని మళ్లీ కౌంటర్ ఇచ్చింది రష్మిక. ‘మేడం నా ఉద్దేశం అది కాదు మేడం. ఒక్కసారి నన్ను 23న కలవండి మేడం. అన్నీ వివరిస్తా’ అని ఫినిషింగ్ ఇచ్చాడు విజయ్..
 
మొత్తంగా వీరి ట్విట్టర్ రొమాన్స్ కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అన్నట్టు.. ఈ గీతగోవిందం ఫస్ట్ లుక్ ఈ నెల 23నే విడుదల కాబోతోంది. ఎలాగూ అప్పుడు కలుస్తారు కాబట్టే విజయ్ అలా అన్నాడన్నమాట. 

More Related Stories