English   

టాక్సీవాలా.. టీజర్ ఇలా ఉందేంటీ..?

Taxiwaala-teaser

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా టీజర్ విడుదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ట్ చేసిన టాక్సీవాలా ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా చెప్పారు. కానీ అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదీ ఈ టీజర్ లో కనిపించలేదు. సరికదా ఏ మాత్రం ఆసక్తిగానూ లేదు. ఆరంభంలో కొత్తగా అనిపించినా, ఏదో ఇన్వెస్టిగేషన్ మోడ్ లో సాగే కథేమో అనిపించినా.. అంత లేదని తర్వాత తెలిసిపోతుంది. సరే టీజరే కదా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం వేస్ట్ అనిపించొచ్చు. కానీ కనీసం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేకపోతే ఎలా.. కేరళలో ఓ యువకుడు ఇలా ట్రై చేయాలని చూసి సొంత ఫ్యామిలీనే చంపుకున్నాడు.. ఇంతకు మించి ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ఇక విజయ్ దేవరకొండ ఎంట్రీ నుంచి చివరి వరకూ ఎక్కడా ఎట్రాక్ట్ చేయలేదు. అస్సలు టీజర్ కటింగే బాలేదని చెప్పాలి. ఏం చెప్పాలనుకున్నారనేది చెప్పకపోయినా ఫర్వాలేదు. కానీ ఏం చూపించాలనుకున్నారో అదైనా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కదా.. విజయ్ తో పాటు మరో రెండు పాత్రలు మాత్రమే ఎలివేట్ అవుతున్నాయి. తర్వాత కార్ పై ఎక్కువ కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇది టీజరే కాబట్టి అప్పుడే ఇది బాలేదనలేం కానీ.. టీజర్ కటింగ్ మాత్రం బాలేదు. 

More Related Stories