English   

స‌ర్కార్.. ఈ సారి మాఫియా..!

SARKAR-first-look

విజ‌య్.. త‌మిళ‌నాట ఈ పేరుకు ఉన్న ఇమేజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం. ర‌జినీకాంత్ త‌ర్వాత ఈయ‌నే అనేంత‌గా ఇప్పుడు అక్క‌డ మార్కెట్ ఉంది. పైగా ర‌జినీ ఇప్పుడు వ‌ర‌స డిజాస్ట‌ర్స్ ఇస్తున్నాడు కాబ‌ట్టి అన్ అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ కూడా ఇప్పుడు విజ‌యే. మెర్స‌ల్ తో రికార్డుల లెక్క‌ల‌న్నీ తిర‌గ‌రాసాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ అంటూ వ‌స్తున్నాడు విజ‌య్. జూన్ 22న ఈయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ టైటిల్ విడుద‌లైంది. ఈ స్టిల్స్ చూస్తుంటే ఈ సారి మాఫియాను టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మైపోతుంది. విజ‌య్-మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. దీనికి ముందు తుపాకిలో స్లీప‌ర్ సెల్స్ గురించి.. క‌త్తిలో రైతుల గురించి చెప్పాడు మురుగదాస్. ఇప్పుడు మాఫియాను ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందులో విజ‌య్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుందంటున్నాడు మురుగ‌దాస్. పైగా స్పైడ‌ర్ త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ మురుగ‌దాస్ ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసింది. ఇప్పుడు క‌చ్చితంగా విజ‌య్ సినిమాతో హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక్క‌డ ఓ సెంటిమెంట్ మురుగ‌దాస్ కు బ‌లాన్నిస్తుంది. క‌త్తి.. తుపాకికి ముందు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు మురుగ‌దాస్. విజ‌య్ తో సినిమా చేసి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న స‌ర్కార్ దీపావ‌ళికి విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. స‌ర్కార్ తో విజ‌య్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో..?

More Related Stories