English   

 విజ‌య్ ని విల‌న్ చేసిన ర‌జినీ..

Rajinikanth- Vijay-Sethupathi

విజ‌య్ అంటే త‌మిళ‌నాట ర‌జినీ త‌ర్వాత ఉండే హీరో క‌దా.. నెక్ట్స్ నెం.1 అంటున్నారు.. అలాంటి హీరో ఎందుకు ఇప్పుడు విల‌న్ గా మారిపోతున్నాడు అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ర‌జినీకాంత్ సినిమాలో విజ‌య్ విల‌న్ గా న‌టిస్తుండ‌టం నిజ‌మే. కానీ అక్క‌డ విజ‌య్ అంటే సీనియ‌ర్ హీరో విజ‌య్ కాదు.. విజ‌య్ సేతుప‌తి. మ‌క్క‌ల్ సెల్వ‌న్ గా ప్రేక్ష‌కుల‌తో నీరాజ‌నాలు అందుకుంటున్న విజ‌య్ సేతుప‌తి.. ఇప్పుడు ర‌జినీ కోసం విల‌న్ గా మారిపోతున్నాడు. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న ర‌జినీ.. త్వ‌ర‌లోనే ఇండియాకు రానున్నారు. వ‌చ్చీ రాగానే కాలా సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొంటారు. ఆ సినిమాతో పాటే కార్తిక్ సినిమాను కూడా ప‌ట్టాలెక్కించ బోతున్నాడు ర‌జినీకాంత్. హీరోగా సూప‌ర్ ఫామ్ లో ఉండి కూడా ర‌జినీ కోసం విజ‌య్ విల‌న్ గా మార‌డం వెన‌క కార‌ణం లేక‌పోలేదు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ఈ హీరోకు మంచి దోస్త్. పిజ్జాతో విజ‌య్ ను స్టార్ గా మార్చేసింది ఈయ‌నే. ఆ త‌ర్వాత కూడా రెండు సినిమాలు చేసాడు విజ‌య్ తో. ఆ స్నేహంతోనే ఇప్పుడు ర‌జినీ సినిమాలో విలన్ గా మారిపోయాడు విజ‌య్ సేతుప‌తి.
 

More Related Stories