English   

 సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫోకస్ మూవీ.. హీరో ఎవరంటే?

focus
2021-12-27 08:48:34

 జి సూర్య తేజ దర్శకత్వంలో విజయ్ శంకర్,అషు రెడ్డి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం ఫోకస్. రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ఐరా క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఫోకస్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో జి సూర్యతేజ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

ఇక ప్రముఖ  సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ఇందులో కీలక పోషిస్తున్నారు. అలాగే ఇందులో భానుచందర్ భరత్ రెడ్డి,సూర్య భగవాన్ , జీవా, షియాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మర్డర్ మిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ ఫోకస్ సినిమా వాటన్నిటికీ భిన్నమైనదని, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను, సస్పెన్స్ థ్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది అని చిత్ర దర్శకుడు సూర్యతేజ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇందులో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు వినోద్ యజమాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయం అయినా  అషు రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

More Related Stories