English   

విజయ్.. వీడు మామూలోడు కాదు..

Vijay-Deverakonda
2018-07-30 14:57:14

అసాధ్యుడు.. అఖండుడు.. వీడు సామాన్యుడు కాడు.. ఇలా ఎన్ని టైటిల్స్ ఉంటే అన్నీ తీసుకొచ్చి విజయ్ దేవరకొండకు ఇచ్చేయాలి. లేకపోతే మనోడి తెలివితేటల ముందు ఎవరైనా అంతే. అమ్మో అమ్మో.. తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఈ కుర్రాడికి తెలిసినట్లు మరెవరికీ తెలియదు. బాలీవుడ్ తెలివితేటలను మన ముందుకు తీసుకొస్తున్నాడు విజయ్. 

గీతాగోవిందం ఆడియోలో తన మీద తానే సెటైర్లు వేసుకోవడం నుంచి తన పాట పాడటం.. బయట ఆ పాటకు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ ను.. ట్రోల్స్ ను అక్కడ అందరిముందు చూపించడం.. ఆ తర్వాత సినిమాలో అంతా హీరోయిన్ చేస్తుంది తనదేం లేదని చెప్పడం.. స్టేజ్ పై అందరి కాళ్లు పట్టుకోవడం ఇలా చాలా రచ్చ చేసాడు విజయ్. ముఖ్యంగా తాను నిజంగానే మారిపోయానని.. ఈ ఫంక్షన్ కు వస్తున్నపుడు కూడా బన్నీవాసు.. పరుశురామ్.. అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా ఫోన్ చేసి నువ్వేం రచ్చ చేయకురా నాయనా అంటూ వార్నింగ్ ఇచ్చారని చెప్పాడు విజయ్. దానికితోడు తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని.. కాస్త నమ్మడం నన్ను అంటున్నాడు విజయ్. 

బూతులకు కూడా దూరంగా ఉన్నానని.. గీతగోవిందం క్లీన్ సినిమా అని చెప్తున్నాడు ఈ హీరో. బన్నీ కూడా విజయ్ ఉన్నాడు అది క్లీన్ సినిమా ఎలా అవుతుందని ప్రేక్షకులు కంగారు పడొద్దంటూ సెటైర్ వేసాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ వేడుక పేరు చెప్పి లుంగీ కట్టుకుని వచ్చాడు విజయ్. అదేంటి లుంగీ ఎందుకు అంటే బట్టలు ఆరలేదు.. పైగా రౌడీ క్లబ్ కు ప్రమోషన్ కూడా ఉంటుందని వేసుకొచ్చానంటు సమాధానం చెప్పాడు విజయ్. తను మారిపోయానంటూనే టన్నుల కొద్దీ ఆటిట్యూడ్ చూపించాడు ఈ కుర్ర హీరో. మరి రేపు సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఇంక మనోన్ని ఆపడం అంత ఈజీ కాదు. 

More Related Stories