English   

అర్జున్ రెడ్డితో పోటీప‌డుతున్న క‌ళ్యాణ్ రామ్..

vijay and kalyana ram
2018-02-24 12:17:14

యిజం త‌ర్వాత సినిమాలేవీ చేయ‌లేదు క‌ళ్యాణ్ రామ్. వ‌ర‌స‌గా రెండు సినిమాలు ఒప్పుకున్నాడు.. ఇప్పుడు వాటిని పూర్తిచేసే ప‌నిలోనే బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో న‌టిస్తున్నాడు ఈ హీరో. ఈ రెండు సినిమాల షూటింగ్స్ అయిపోయాయి. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈయ‌న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక కొత్త ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్ తో విజ‌య్ చేస్తోన్న ట్యాక్సీవాలా సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2, యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్నారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే.. విజ‌య్ ట్యాక్సీవాలా ఒకేరోజు విడుద‌ల కానున్నాయి. అదే మే 18. ఈ రెండు సినిమాల‌కు లీడింగ్ పీఆర్వోలే నిర్మాత‌లు కావ‌డం విశేషం. విజ‌య్ సినిమాను ఎస్ కే ఎన్ నిర్మిస్తుంటే.. నా నువ్వే సినిమాను మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తుంటే.. విజ‌య్ సినిమాను రాహుల్ తెర‌కెక్కిస్తున్నాడు. మ‌రి ఈ రెండు సినిమాలు ఒకేరోజు వ‌స్తే.. ఎవ‌రు ఈ పోటీలో గెలుస్తారో చూడాలిక‌..! ఇప్పుడు క్రేజ్ ప‌రంగా చూస్తే మాత్రం అర్జున్ రెడ్డికే అదే మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

More Related Stories