English   

స‌ల్మాన్ ను టార్గెట్ చేసిన రాజ‌మౌళి తండ్రి..

salman-vijendra

అవును.. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. చాలా ఏళ్లుగా త‌న‌యుడి సినిమాల‌కు మాత్ర‌మే క‌థ‌లు రాస్తూ వ‌చ్చిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇప్పుడు బ‌య‌టి సినిమాల‌కు కూడా క‌థ‌లు రాస్తున్నారు. కొన్నేళ్లుగా ఈయ‌న రాస్తున్న క‌థ‌లు ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే భ‌జ‌రంగీ భాయీజాన్, మెర్స‌ల్ సినిమాలు ఇండియ‌న్ పిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసాయి. ఇలాంటి టైమ్ లో ఈయ‌న ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కోసం క‌థ రాసే ప‌నిలో ఉన్నాడు. ఈ మ‌ల్టీస్టార‌ర్ పైనే దృష్టి పెట్టాడు విజ‌యేంద్రుడు. ఇక ఓ వైపు ఈ క‌థ వండుతూనే మ‌రోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కోసం మ‌రో క‌థ సిద్ధం చేస్తున్నాడు. ఈ కథ బాహుబలిని మించేలా.. భ‌జ‌రంగీ భాయీజాన్ ను మ‌రిపించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేని షారుక్ ఖాన్ కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌చ్చితంగా హిట్ ఇచ్చే క‌థ‌నే సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాపై త్వ‌ర‌లోనే పూర్తి క్లారిటీ రానుంది. ఇదే నిజం అయితే మాత్రం విజ‌యేంద్రుడి ల‌క్ష్యం ముందు భ‌జ‌రంగీ భాయీజాన్ ను దాటేయ‌డ‌మే. మ‌రి చూడాలిక‌.. షారుక్ సాయంతో స‌ల్మాన్ ను విజ‌యేంద్ర ప్ర‌సాద్ దాటేస్తాడో లేదో..?
 

More Related Stories