English   

కంగనా కావాలంటున్న విజయేంద్ర ప్రసాద్ 

 Vijayendra Prasad
2021-06-24 12:32:45

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలుగులో మంచి కథా రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ రాజేంద్రప్రసాద్ ఏ కథను అందించడం విశేషం. బజరంగీ భాయిజాన్ ,బాహుబలి లాంటి వరుస హిట్లతో పాన్ ఇండియా రచయితగా ఎదిగాడు. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కథలకి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉందంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన సినిమాకు నటీ నటులకు కూడా సజెస్ట్ చేస్తారట. 

దర్శకులుు కూడా నటీనటుల ఎంపిక విషయంలో విజయేంద్ర ప్రసాద్ మాట వింటారట. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ప్రస్తుతం సీత అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు కూడా విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం కంగనా రనౌత్ తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా దానిపై ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. సీత సినిమాను రామాయణంలోని సీత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే విజయేంద్రప్రసాద్ కథను అందించిన జయలలిత బయోపిక్ 'తలైవి' లో కూడా కంగనారనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో నటీనటులను ఎంపిక చేసే రేంజ్ లో మన తెలుగు రచయిత ఎదగడం మనం గర్వపడాల్సిన విషయమే.

More Related Stories