English   

 అల్లుడి రాక‌కు కొన్ని గంట‌లే..!

Vijetha-movie

ఇంకా కొన్ని గంట‌లే.. మిగిలింది ఇంకా కొన్ని గంట‌లే. అది కూడా ఓపిక ప‌డితే మెగా కుటుంబం నుంచి మ‌రో హీరో వ‌చ్చేస్తాడు. చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విజేత జులై 12న విడుద‌లవుతుంది. దాదాపు 400 స్క్రీన్స్ లో ఈ చిత్రం వ‌స్తుంది. ఓవ‌ర్సీస్ కూడా ఈ చిత్రాన్ని భారీగానే విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్.. ట్రైల‌ర్.. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదే చిత్ర‌యూనిట్ లో న‌మ్మ‌కం పెంచేసింది. మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన హీరోలెవ‌రైనా కాస్త క‌ష్ట‌ప‌డితే చాలు.. ఆ త‌ర్వాత ఫ్యాన్సే వాళ్ల‌ను చూసుకుంటారు. రెండు హిట్లు ప‌డితే మాస్ ఇమేజ్ వ‌ద్ద‌న్నా వ‌చ్చేస్తుంది. ఇన్ని ప్లాపులు ఉన్నా కూడా సాయిధ‌రంతేజ్ ఇంకా అవ‌కాశాలు సాధిస్తున్నాడంటే దానికి కార‌ణం అత‌డి మాస్ ఇమేజ్. అయితే ఇప్పుడు క‌ళ్యాణ్ మాత్రం కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. మెగా కుటుంబానికి అల‌వాటు లేని క్లాస్ ఇమేజ్ తో వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వ‌రుణ్ తేజ్ మాత్ర‌మే అలా కొత్త కొత్త‌గా ట్రై చేస్తూ త‌న దారిలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న‌కు తోడుగా క‌ళ్యాణ్ కూడా వ‌చ్చేసాడు. ఈ కుర్ర హీరో తొలి సినిమాతోనే క్లాస్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. రాకేశ్ శ‌శి దీనికి ద‌ర్శ‌కుడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమాతో అల్లుడు ఎంత‌వ‌ర‌కు మాయ చేస్తాడో..? 
                                                    

More Related Stories