English   

విజేత షార్ట్ రివ్యూ: అల్లుడు ఆకట్టుకున్నాడండోయ్..

Vijetha-Movie
2018-07-12 13:49:51

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన విజేత ఇవాళ విడుదలైంది. రాకేశ్ శశి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎక్కడా ‘అతి’లేకుండా సాధారణంగా తెరకెక్కించారు. దీంతో సినిమాలో ఫీల్ గుడ్ అంశాలు చాలానే కనిపించాయి. కథ పాతదే అయినా.. కథనం ఆకట్టుకుంటుంది. తెలిసిన సన్నివేశాలే అయినా మనకు తెలియకుండానే ఈ సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేలా కథనం ఉంటుంది. దీంతో విజేతకు పాస్ మార్కులు దాటి పడతాయి. 

ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా ఈజ్ తో నటించాడు కళ్యాణ్ దేవ్. శివ అనే కుర్రాడి పాత్రలో అలా సింపుల్ గా ఒదిగిపోయాడు. అటు మాళవిక నాయర్ కు పెద్దగా ప్రిఫరెన్స్ లేకున్నా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఈ సినమా కథ విన్న తర్వాత తండ్రి పాత్రకు దర్శకుడు ఫలానా నటుడ్ని అనుకున్నాడు. కానీ మురళీ శర్మను తీసుకోవాలని మాత్రమే మెగాస్టార్ చిరంజీవి సూచించాడు అని చెబుతూ వచ్చారు. నిజమే.. ఈ విషయంలో ఆయన సీనియారిటీ ఎంత ఉపయోగపడిందనే సినిమా చూస్తే తెలుస్తుంది. ఇంకా చెబితే ఈ సినిమాలో హీరో మురళీ శర్మనే అనొచ్చు. అం అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన ఫోటోకు ప్రైజ్ వచ్చినప్పుడు ఆయన నటనకు తెలియకుండానే ఆడియన్స్ బరస్ట్ అయిపోతారు. మొత్తంగా మెగా అల్లుడు కదా అనవసరపు హంగులు, ఆర్భాటాలు లేకుండా పద్ధతిగా రాసుకున్న స్క్రిప్ట్ ను అంతే పద్ధతిగా తెరకెక్కించిన దర్శకుడు రాకేశ్ .. కళ్యాణ్ దేవ్ ను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిపాడనే చెప్పాలి. 

More Related Stories