English   

 విజేత‌ రివ్యూ 

Vijetha-Review
2018-07-12 07:27:39

చిరు చిన్న‌ల్లుడి సినిమా అన‌గానే కాస్తో కూస్తో ఆస‌క్తి వ‌చ్చింది విజేత సినిమాపై. దానికితోడు ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న క‌థ కావ‌డంతో ఎలాగైనా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే ఊహ‌ల్లోనే ఉన్నాడు ద‌ర్శ‌కుడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిజ‌మైంది..? విజేత నిజంగానే ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా..? 

క‌థ‌: రామ్(క‌ళ్యాణ్ దేవ్) చ‌దువు పూర్తి చేసుకుని ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి శ్రీ‌నివాస‌రావు(ముర‌ళి శ‌ర్మ‌) నీడ‌లోనే ఉంటాడు. ఆయ‌న క‌ష్ట‌ప‌డుతుంటే రామ్ మాత్రం ఊరికే ఉంటాడు. ఉద్యోగం చేయ‌డు.. అల్ల‌రి చిల్ల‌రిగా తిరుగుతున్న రామ్ జీవితంలోకి చైత్ర‌(మాళ‌విక న‌య్య‌ర్) వ‌స్తుంది. ఎదురింట్లో ఉన్న ఈమెపై మ‌న‌సు పారేసుకుంటాడు రామ్. అన్నీ తండ్రి అనుకుని జీవిస్తున్న రామ్ కు అనుకోకుండా ఓ రోజు షాక్ త‌గులుతుంది. తండ్రికి హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఒక్క‌సారిగా రామ్ జీవితం త‌ల‌కిందులు అవుతుంది. ఆ త‌ర్వాత ఆ తండ్రి కోసం కొడుకు ఏం చేసాడ‌నేది క‌థ‌.

క‌థ‌నం: విజేత క‌థ గురించి చెప్పాలంటే చాలా రొటీన్. కొడుకు జీవిత‌మే త‌న జీవితం అనుకునే తండ్రి క‌థ ఇది. ఫోటోగ్ర‌ఫీ లైఫ్ అనుకున్న తండ్రి.. కుటుంబం కోసం అన్నీ కాంప్ర‌మైజ్ అయిపోయి జీవితంలో రాజీ ప‌డి బ‌తుకుతుంటాడు. మిడిల్ క్లాస్ కావ‌డంతో కొడుకు కోసం అప్పులు చేసి లోటు లేకుండా చూసుకుంటాడు. కానీ కొడుకు మాత్రం చ‌దువు పూర్తైన త‌ర్వాత కూడా బేవార్స్ గా తిరుగుతుంటాడు. అలాంటి తండ్రి కొడుకుల క‌థే ఈ చిత్రం. రొటీన్ క‌థే అయినా కూడా త‌న క‌థ‌నంతో ఆసక్తి పుట్టించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో తొలి అర‌గంట హీరో కారెక్ట‌రైజేష‌న్.. ఫ్రెండ్స్ తో సోది ఉంటుంది. అది తీసి క‌థ‌లోకి వెళ్లిన త‌ర్వాత అస‌లు క‌థ‌నం మొద‌ల‌వుతుంది. ఇంట‌ర్వెల్ టైమ్ కు క‌థ పూర్తిగా గాడిన ప‌డుతుంది. ఇక రెండో భాగంలో ఎక్క‌డా సైడ్ ట్రాక్ వెళ్ల‌కుండా ద‌ర్శ‌కుడు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు స్క్రీన్ పై చూపించాడు. ప‌నికి రాడు అనుకున్న కొడుకు ప్ర‌యోజ‌కుడు కావ‌డం.. తీర‌ని కోరిక‌గా మిగిలిన తండ్రి కోరిక‌ను మ‌ళ్లీ ఆ కొడుకే తీర్చ‌డం ఇవ‌న్నీ ఎమోష‌న‌ల్ గా బాగా క‌నెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం. ముర‌ళి శ‌ర్మ ఈ క‌థ‌కు ప్రాణం పోసాడు.

న‌టీన‌టులు: క‌ళ్యాణ్ దేవ్ తొలి సినిమా కావ‌డంతో న‌ట‌న గురించి పెద్ద‌గా మాట్లాడుకోవాల్సిన ప‌నిలేదు. ఇంకా చాలా మెరుగుప‌డాలి. కాక‌పోతే నేల‌మీద ఉండే క‌థ‌ను తొలి సినిమా కోసం ఎంచుకోవ‌డం మెచ్చుకోద‌గ్గ అంశం. ఇలాగే క‌థ‌కు ప్రాధాన్యం ఇస్తే ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. ఇక హీరోయిన్ మాళ‌విక న‌య్య‌ర్ ప‌క్కింటి అమ్మాయిలా ఒదిగిపోయింది. తండ్రి పాత్ర‌లో ముర‌ళి శ‌ర్మ ప్రాణం పెట్టాడు. ఆయ‌నే సినిమాకు హీరో. సెకండాఫ్ అయితే పూర్తిగా ఆయ‌న‌పైనే న‌డిచింది. ముర‌ళిశ‌ర్మ స్నేహితుడిగా త‌ణికెళ్ళ భ‌ర‌ణి బాగా చేసాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: విజేత ఔట్ పుట్ బాగా వ‌చ్చిందంటే దానికి కార‌ణం మ్యూజిక్. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వర్ ఎలా ఉంటాడో చాలా మందికి తెలియ‌దు కానీ ఆయ‌న సంగీతం మాత్రం ఇప్పుడు అంద‌రికీ తెలిసింది. చాలా సీన్స్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలైట్ చేసాడు ఈయ‌న‌. అంతేకాదు.. పాట‌లు కూడా బాగున్నాయి. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. ఎడిటింగ్ ప‌ర్లేదు. సాయి కొర్ర‌పాటి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కొత్త హీరో అయినా కూడా ఖ‌ర్చు భారీగానే పెట్టాడు. ఇక ద‌ర్శ‌కుడిగా రాకేష్ శ‌శి తొలి సినిమాతో పోలిస్తే రెండో సినిమాకు చాలా బెట‌ర్. రొటీన్ క‌థతోనే ప‌ర్లేదనిపించాడు. అయితే ఊహించే క‌థ కావ‌డం ఒక్క‌టే దీనికి మైన‌స్.

చివ‌ర‌గా: విజేత‌.. ప్ర‌మోష‌న్ చేసుకుంటే విజేత‌.. లేదంటే..!

రేటింగ్: 3/5.

More Related Stories