English   

చిరంజీవి చిన్నల్లుడు స్పీడ్ పెంచుతున్నాడు

vijetha
2018-06-11 16:54:17

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మారిన సంగతి తెలుసు కదా.. ఆ సినిమాకు చిరు టైటిల్ నే పెట్టారు విజేత అని. టైటిల్ తో పాటు కళ్యాణ్ దేవ్ ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో విజేత టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 8.59నిమిషాలకు విజేత టీజర్ ను విడుదల చేస్తారు. గతంలో జతకలిసే అనే సినిమా రూపొందించిన రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వారాహి బ్యానర్ వారు నిర్మించాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించాడు. 

ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు. వారంతా తమదైన శైలిలో రాణిస్తూనే ఉన్నారు. ఆ టీమ్ లోకి ఇప్పుడు కొత్తగా కళ్యాణ్ దేవ్ వస్తున్నాడు. కుర్రాడు చూడ్డానికి బానే ఉన్నాడు. కాబట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటుందనుకోవచ్చు. మరి నటన పరంగా ఎలా మెప్పిస్తాడనేది చూడాలి. అయితే ఈ టీజర్ తో కొంత వరకూ కళ్యాణ్ టాలెంట్ ఏంటో అంచనా వేయొచ్చు. మరి ఇన్నాళ్లూ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఆదరించినా మెగా ఫ్యాన్స్.. ఈ కళ్యాణ్ దేవ్ ను కూడా ఆదరిస్తారా అనేది చూడాలి.. 

More Related Stories