English   

కళ్యాణ్ విజేత గా నిలుస్తాడా..?

Vijetha-Trailer
2018-06-25 12:56:46

చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలున్నారు. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు. అలా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరో అయ్యాడు. ఈ సినిమాకు విజేత అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిన్న సాయంత్రం విజేత ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే కళ్యాణ్ ను బాక్సాఫీస్ వద్దా విజేతగా నిలిపేలానే ఉందంటున్నారు. మిడిల్ క్లాస్ కథలు మన ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే ఈ కొత్త కుర్రాడికి ఈ నేపథ్యం ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే చిరంజీవి నటించిన విజేత సూపర్ హిట్ అయింది. ఆ టైటిల్ ను రిపీట్ చేయడం సినిమాకు కలిసొచ్చే మరో అంశం. ట్రైలర్ చూస్తోంటే కళ్యాణ్ దేవ్ ఫస్ట్ మూవీ అయినా కాస్త ఈజ్ గానే చేశాడనిపిస్తోంది. ఇక ఈ మూవీలో అతని సరసన ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ నటించింది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బావుంది. ఆ విజేత విజయం సాధించాడు కాబట్టి..ఈ విజేతా విజయం సాధిస్తాడు అని చెప్పలేం.. కాకపోతే ఇందులోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ఉద్యోగం లేదని కొడుకును మందలించే తండ్రి ఉన్నాడు. కుటుంబం కోసం ఆరాపటడే తండ్రి పాత్రలెప్పుడూ మనకు హిట్ ఫార్ములాసే.తండ్రి కష్టం బ్రతుకుతూ..ఆవారాగా తిరిగే కొడుకు.. కుటుంబం పరిస్థితులు తలకిందులైనప్పుడు ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు తలకెత్తుకునే కుర్రాడైపోతాడు. ఇలాంటి కథలు కూడా మనం చాలా చూశాం. కాకపోతే కొత్తదర్శకుడు కొత్తదనం ఉన్న స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటున్నారు. ఆ రకంగా విజేత ఏ మేరకు మెప్పిస్తాడనేది చూడాలి.  మొత్తంగా విజేత యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. 

More Related Stories