English   

విక్ర‌మ్ ను ఆ సామి క‌రుణిస్తాడా..?

Vikram is compelled by that Saami
2018-06-05 08:42:12

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ప‌దేళ్లుగా ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు విక్ర‌మ్. అప్పుడెప్పుడో వ‌చ్చిన అప‌రిచితుడు త‌ర్వాత ఆ రేంజ్ హిట్ లేదు ఈ హీరోకు. మ‌ధ్య‌లో వ‌చ్చిన దైవ‌తిరుమ‌గ‌న్.. ఐ.. ఇరుముగ‌న్.. లాంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అయ్యాయి కానీ విక్ర‌మ్ కోరు కునే బ్లాక్ బ‌స్ట‌ర్లు కావు అవి. ఈ హీరో మొన్న సంక్రాంతికి స్కెచ్ సినిమాతో వ‌చ్చాడు. ఈ సినిమా కూడా డిజాస్ట‌రే. విక్ర‌మ్ లాంటి టాలెంటెడ్ హీరోకి ఈ బ్యాడ్ టైమ్ రావ‌డం అభిమానుల‌ను కూడా బాధలో ముంచేస్తుంది. కానీ ఏం చేస్తాం.. అభిమానులు బాధ ప‌డి వ‌దిలేస్తారు. కానీ ఫామ్ లోకి రావాల్సిన బాధ్య‌త మాత్రం విక్ర‌మ్ దే. విక్ర‌మ్ కూడా రొటీన్ క‌థ‌ల‌కు అల‌వాటు ప‌డ‌టం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. విక్ర‌మ్ లాంటి హీరో నుంచి రావాల్సిన సినిమాలు ఇవి కావంటూ పెద‌వి విరిచారు అభిమానులు. ప్ర‌స్తుతం సామి స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు విక్ర‌మ్. 15 ఏళ్ళ కింద వ‌చ్చిన సామికి ఇది సీక్వెల్. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే ఇందులో కూడా కొత్త క‌థేం లేదు కానీ హ‌రి మ్యాజిక్ మాత్రం క‌నిపిస్తుంది. ఈ చిత్రంతో క‌చ్చితంగా విక్ర‌మ్ ఫామ్ లోకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. అప్ప‌ట్లో విక్ర‌మ్ ను స్టార్ గా మార్చేసిన సినిమా సామినే. మ‌ళ్లీ ఇప్పుడు క‌ష్టాల్లో ఉన్న విక్ర‌మ్ కే ఇదే సినిమా సీక్వెల్ ఊపిరి ఊదుతుందో లేదో..? ఇక గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రంలో కూడా న‌టిస్తుంది కానీ అదెప్పుడు వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. 

More Related Stories