English   

క‌రోనా ఎఫెక్ట్.. విరాట‌ప‌ర్వం రిలీజ్ వాయిదా

Virata Parvam
2021-04-14 17:20:34

రానా సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన సినిమా విరాట‌ప‌ర్వం. ఈ సినిమాకు వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు పోస్ట‌ర్స్ తో సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలో రానా న‌క్స‌లైట్ గా న‌టించడం. సాయి ప‌ల్ల‌వి ప‌ల్లెటూరి పిల్ల లుక్ లో క‌నిపించ‌డంతో సినిమాపై ఎన్నో అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

అంతే కాకుండా సినిమా నుండి విడుద‌లైన కోలో కోలో పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమాను ఎప్రిల్ 30న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది. కాగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఒక్కో సినిమా విడుద‌ల చేయ‌కుండా వెన‌కడుగు వేస్తున్నాయి. ఇప్ప‌టికే ల‌వ్ స్టోరి సినిమా విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

కాగా ఇప్పుడు విరాట ప‌ర్వం సినిమాను కూడా విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతే కాకుండా త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. క‌రోనా సెంక‌డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని వేగంగా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ లు ధ‌రించాల‌ని..జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపింది. 

More Related Stories