English   

విశాల్ బాగా గ‌ట్టిగా కొట్టాడ‌బ్బా..!

vishal abhimanyudu
2018-06-05 08:46:37

చీక‌టి ఉన్న‌పుడే వెలుగుకు విలువ‌.. ఓటమి ఉన్న‌పుడే గెలుపుకు విలువ‌. ఇప్పుడు విశాల్ కు కూడా ఇదే అర్థ‌మ‌వుతుంది. ఇన్నాళ్లూ తెలుగులో ఈయ‌న ఒక్క హిట్ అంటూ చూసాడు. కానీ ఏం చేస్తాం.. ఆయ‌న సినిమాలు వ‌చ్చి మంచి టాక్ తెచ్చుకున్నా కూడా అదే టైమ్ లో మ‌న సినిమాలు కూడా బాగా ప‌ర్ఫార్మ్ చేయ‌డంతో ఆ గుంపులో విశాల్ సినిమాలు మాయ‌మైపోయేవి. కానీ ఇప్పుడు ఈ హీరో కోస‌మే మ‌న హీరోలు చీక‌ట్లు తీసుకొ చ్చారు. అభిమ‌న్యుడు విడుద‌లైన రోజే నాగార్జున ఆఫీస‌ర్.. రాజ్ త‌రుణ్ రాజుగాడు విడుద‌ల‌య్యాయి. ఈ సినిమాలు తొలిరోజే ఔట్ రేటెడ్ గా భారీ డిజాస్ట‌ర్లు అని తేలిపోయింది. ఆఫీస‌ర్ తొలిరోజు 45 లక్ష‌ల ఓపెనింగ్స్ తీసుకొస్తే.. రాజుగాడు అందులో స‌గం కూడా తీసుకురాలేదు. ఇక ఈ రెండు సినిమాల‌ను దాటేస్తూ అభిమ‌న్యుడు తొలిరోజే కోటి 20 ల‌క్ష‌ల షేర్ తీసుకొచ్చాడు. మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 6.5 కోట్ల గ్రాస్.. 3.9 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. ఫుల్ ర‌న్ లో మ‌రో 2 కోట్లు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. పైగా సినిమా ఓన్ రిలీజ్ కావ‌డంతో విశాల్ కు లాభాల పంట ఖాయమైపోయింది. మొత్తానికి సొంత భాష‌లో హిట్ కొట్టాల‌న్న ఆశ చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ తీరింది విశాల్ కు. 

More Related Stories