English   

విశాల్ కూ త‌ప్ప‌డం లేదు

Vishal-Abhimanyudu
2018-05-05 13:26:27

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు అక్క‌డెంత మంది అభిమానులున్నారో.. తెలుగులోనూఅంతే అభిమానులున్నారు. పైగా తెలుగువాడే కావ‌డంతో ఇక్క‌డ ఈ న‌ల్ల‌నయ్య‌ను కాస్త ఎక్కువ అభిమానంతోనే చూస్తారు మ‌నాళ్లు. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కూ రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసిన విశాల్ లేటెస్ట్ గా ట్రాక్ మార్చాడు. అత‌ని లాస్ట్ మూవీ డిటెక్టివ్ సూప‌ర్ థ్రిల్ల‌ర్ గా అద‌ర‌గొట్టింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా పేరు ఇరుంబు తిరై. తెలుగులో అభిమ‌న్యుడు. అయితే గ‌త కొన్నాళ్లుగా కోలీవుడ్ లో సినిమా ఇండ‌స్ట్రీ స‌మ్మె న‌డిచింది. అక్క‌డ న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుకుడుగా విశాల్ ఆ స‌మ్మెను ముందుండి న‌డిపించాడు. చివ‌రికి స‌మ్మె  స‌క్సెస్అయింది విర‌మించారు. కానీ ఇప్పుడే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. నిజానికి ఈ ఇరుంబు తిరై జ‌న‌వ‌రిలో విడుద‌ల కావాల్సిన సినిమా. కానీ అప్పుడు విశాల్ బిజీగా ఉండ‌టంతో వాయిదా ప‌డింది. ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ముందు డేట్స్ అనౌన్స్ చేసుకున్న‌వారికి అవ‌కాశాలివ్వాలని పెద్ద మ‌న‌సు చాటుకున్నాడీ స్టార్ హీరో. అయితే త‌న సినిమాపై ఆడియ‌న్స్ లో క్రేజ్ త‌గ్గింద‌నేది నిజం. అది అత‌నికీ తెలుసు. అందుకే ఇప్పుడు కొత్త ప్లాన్ వేశాడు. త‌న సినిమా ఫుటేజ్ స్క్రీనింగ్ చేయ‌బోతున్నాడు. ఈ ప‌దం చాలా కొత్త‌గా ఉంది క‌దూ. య‌స్.. ఫుటేజ్ స్క్రీనింగ్ సినిమా లోని ఇంట్ర‌స్టింగ్ ఫ్యాక్ట‌ర్ అంతా చూపించ‌డం అన్నమాట‌. ఇలాంటి ఫుటేజ్ స్క్రీనింగ్ మామూలుగా హాలీవుడ్ లో ఎక్కువ‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ సౌత్ లో ప‌రిచ‌యం చేస్తున్నాడు విశాల్.  సైబ‌ర్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న ఇరుంబు తిరైని  ఈనెల 9న మీడియా కోసం ఇలాగే ఫుటేజ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు విశాల్. రెండు గంట‌ల‌కు పైగా ఉన్న సినిమా నుంచి ఈ స్క్రీనింగ్ ఫుటేజ్ లో గంట వ‌ర‌క చూపిస్తాడ‌ట‌. అంటే ఆల్మోస్ట్ ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ.  దీని వ‌ల్ల త‌న సినిమాకు మంచి ప్ర‌మోష‌న్ కూడా వ‌స్తుంది. అదే టైమ్ లో ఇలాంటి ట్రెండ్ ను కోలీవుడ్ లో మొద‌లుపెట్టిన‌వాడూ అవుతాడు. ఏదేమైనా.. విశాల్ అక్క‌డ మ‌రీ సూప‌ర్ స్టార్ కాక‌పోయినా మాంచి ఓపెనింగ్స్ తెచ్చుకోగ‌ల స్టామినా ఉన్న‌వాడు. అయినా ఓ చోటా మోటా హీరోల్లా సినిమాకోసం ప్రీ స్క్రీనింగ్ చేయ‌డం త‌ప్ప‌లేదు. మ‌రి ఈ స్క్రీనింగ్ త‌ర్వాత వ‌చ్చే రెస్పాన్స్ ను బ‌ట్టి త‌న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాడ‌ట విశాల్.

More Related Stories