English   

విశాల్ కు మరో హిట్ గ్యారెంటీనా..?

Vishal-abhimanyudu

వరుస విజయాలతో దూసుకుపోతోన్న తమిళ్ స్టార్ విశాల్ లేటెస్ట్ మూవీ ఇరుంబుతిరై. ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో అభిమన్యుడుగా రాబోతోందీ మూవీ. గత శుక్రవారం తెలుగులోనూ విడుదల కావాల్సి ఉన్నా కాలేదు. దీంతో 25కు వస్తుందనుకున్నారు. కానీ ఆ డేట్ కూడా దాటాడు విశాల్. అయితే ఆ రోజు తెలుగు ఆడియో విడుదల చేయబోతున్నారు. సినిమాను మాత్రం జూన్ 1న రిలీజ్ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం విశాల్ సినిమాలు ఊరమాస్ గా ఉండేవి. దీంతో తమిళంలో కొంత వరకూ నడిచినా తెలుగులో వాటి పప్పులు ఉడకలేదు. దీంతో అతనూ రూట మార్చాడు. కాస్త ఇంటిలిజెంట్ సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటున్నాడు. ఆక్రమంలో లాస్ట్ ఇయర్ వచ్చిన డిటెక్టివ్ తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా ముసుగులో సాగే క్రైమ్స్ నేపథ్యంలో చేసిన అభిమన్యుడు కూడా తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు విశాల్. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించిన ఈ మూవీ మొత్తంగా తెలుగులో జూన్ 7న విడుదల కాబోతోంది. 

More Related Stories