English   

అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహం చేధించాడు..

Irumbu-Thirai
2018-05-14 14:34:05

ప‌ద్మ‌వ్యూహంలో ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు నాటి చిన్నారి అభిమ‌న్యుడు. కానీ ఇప్పుడు మాత్రం ప‌ద్మ‌వ్యూహాన్ని చీల్చుకుంటూ బ‌య‌టికి ప‌రుగులు తీస్తూ వ‌చ్చాడు నేటి అభిమ‌న్యుడు. ఈ క‌లియుగ అభిమ‌న్యుడు ఎవ‌రో కాదు.. విశాలే. ఈయ‌న త‌మిళ్ లో న‌టించిన ఇరుంబు తిరైకు తెలుగు వ‌ర్షన్ అభిమ‌న్యుడు. ఈ చిత్రం మే 11న త‌మిళ‌నాట విడుద‌లైంది. ఎప్పుడో మార్చ్ లోనే రావాల్సిన ఈ చిత్రం.. స్ట్రైక్ కార‌ణంగా ఆల‌స్యంగా వ‌చ్చింది. కానీ వ‌చ్చీ రావ‌డంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. డిజిట‌ల్ మీడియాలోని లోపాల‌ను ఎత్తి చూపిస్తూ వ‌చ్చిన ఈ చిత్రానికి టాక్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా విశాల్, అర్జున్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ సినిమాకు ప్రాణం అంటున్నారు ప్రేక్ష‌కులు. దానికి తోడు స‌మంత ఇమేజ్ ఉండ‌నే ఉంది. ఓ వైపు మ‌హాన‌టి త‌మిళ వ‌ర్ష‌న్ న‌డిగ‌ర్ తిల‌గం దుమ్ము దులిపేస్తున్నా కూడా మాస్ ఆడియ‌న్స్ ను త‌న‌వైపు తిప్పుకుంటున్నాడు ఈ అభిమ‌న్యుడు. తెలుగులో వ‌చ్చే వారం రానుంది ఈ చిత్రం. ఇక్క‌డ విశాల్ కు స‌ప‌రేట్ ఫాలోయింగ్ ఉంది.. ఇక స‌మంత‌కు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈ ఇద్ద‌రి పుణ్య‌మా అని తెలుగులోనూ అభిమ‌న్యుడు బాక్సాఫీస్ అనే ప‌ద్మ‌వ్యూహాన్ని చేధిస్తాడో లేదో చూడాలిక‌..!

More Related Stories