English   

విశాల్ తో స‌మంత రొమాన్స్ పీక్స్.. 

Samantha-vishal
2018-03-09 08:30:47

స‌మంత న్యాచుర‌ల్ స్టార్. ఆమె ఏ పాత్ర‌లోకైనా ఇట్టే దూరేస్తుంది. ఒక్క‌సారి పాత్ర‌లోకి వెళ్లిపోయిందంటే ఎవ‌రి మాటా విన‌దు. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ భామ‌. విశాల్ తో ఈమె న‌టిస్తున్న అభిమ‌న్యుడు సినిమాలోని ఓ పాట విడుద‌లైంది. ఇందులో విశాల్ తో ఆమె చేసిన రొమాన్స్.. ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసి ఎవ‌రికైనా కుళ్లు రావాల్సిందే. అంత‌గా ఇద్ద‌రూ స్క్రీన్ పై మాయ చేసారు. ఈ మాయ‌లో ఎక్కువ భాగం స‌మంత‌కే వెళ్లిపోతుంది. చిన్న చిన్న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తోనే పిచ్చెక్కిస్తుంది స‌మంత‌. ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమ‌న్యుడుగా తీసుకొస్తున్నారు. జ‌న‌వ‌రిలోనే రావాల్సిన ఈ చిత్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేదు. మార్చ్ లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. తెలుగులోనూ ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇందులో అర్జున్ విల‌న్ గా న‌టిస్తుండ‌టం విశేషం. తెలుగులో విశాల్ ఇమేజ్ కు తోడు స‌మంత క్రేజ్ కూడా అభిమ‌న్యుడు సినిమాకు క‌లిసి రానుంది. ఈ చిత్రాన్ని విశాల్ నిర్మిస్తున్నాడు. ఈ ఇద్ద‌రి రొమాన్స్ కోస‌మైనా సినిమా ఓసారి చూడచ్చేమో అనిపిస్తుంది. అంత‌గా మాయ చేసారు ఈ జంట‌. ఒక్క పాట‌లోనే కాదు.. అభిమన్యుడులోని అన్ని పాట‌ల్లోనూ స‌మంత‌, విశాల్ రొమాన్స్ కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. అదీ లెక్క‌.. మ‌రి స‌మంతా మ‌జాకా..!

More Related Stories