English   

మంచు విష్ణు మోసగాళ్ళు ట్రైలర్ టాక్

Vishnu Manchu Mosagallu
2021-02-25 18:32:04

మంచు వారబ్బాయి విష్ణు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మోసగాళ్ళు". ఈ సినిమాను జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించారు. సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా రుహీ సింగ్ నటిస్తోంది. సినిమాలో నవదీప్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైనర్ పాతాకాలపై నిర్మిస్తున్నారు. మార్చ్ 19న సినిమాను థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 

దాంతో ఇండియా నుండి అమెరికా వరకు సినిమాలో కథ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల చేసారు. 2 నిమిషాల 30 సెకన్లు ఉన్న ఈ టైలర్ ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైలర్ చూస్తుంటే సినిమా స్క్రీన్ ప్లే యమ స్పీడ్ గా ఉండబోతుందని అర్థం అవుతుంది. ఎన్నో ఆశలతో మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపే హీరో కోట్లకు ఎలా పడగెత్తుతాడు..ఆ తరవాత ఏం జరుగుతుంది. అన్నదే సినిమా కథ అన్నట్టు కనిపిస్తోంది.

More Related Stories