English   

విష్ణు విశాల్ తో పెళ్లి..డేట్ ప్ర‌క‌టించిన గుత్తా జ్వాల

Vishnu Vishal
2021-04-13 15:44:47

ప్ర‌ముఖ బ్యాట్మింట‌న్ క్రీడాకారిని గుత్తా జ్వాల త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ వేల ప్రియుడిని విడిచి ఉండ‌లేక‌పోతున్నా అంటూ గుత్తా జ్వాల పోస్ట్ పెట్ట‌డంతో వీరిప్రేమ పీక్స్ లో ఉంద‌ని అంద‌రికీ అర్థం అయింది. అంతే కాకుండా ఇప్ప‌టికే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. మ‌రోపైపు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు అర‌ణ్య ప్రెస్ మీట్ లో విష్ణు విశాల్ చెప్పారు. కాగా తాజాగా విశాల్ మ‌రియు గుత్తా జ్వాల త‌మ పెళ్లి ప‌త్రిక‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 22న తాము పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌మ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో తాము పెళ్లి చేసుకోబోతున్నామ‌ని చెప్పారు. 

అంతే కాకుండా త‌మ‌పై ప్రేమానురాగాలు కురిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా విష్ణు విశాల్ త‌మిళం హీరోగా న‌టిస్తు ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గుత్తా జ్వాల బ్యాట్మింట‌న్ క్రీడాకారిని అంతే కాకుండా సొంతంగా ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ ను కూడా ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. ఇక ఇదివ‌ర‌కే గుత్తా జ్వాల‌కు బ్యాట్మింట‌న్ క్రీడాకారుడితో వివాహం జ‌ర‌గ్గా ఎవో కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోయారు. మ‌రో వైపు విశాల్ కు కూడా ఇప్ప‌టికే వివాహం జ‌రిగింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం త‌న భార్య‌తో విశాల్ కూడా విడాకులు తీసుకున్నారు. 

More Related Stories