English   

అప్పుడు శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడు సత్యం రాజేష్

vishwamithra
2018-07-16 09:58:37

గీతాంజలి సినిమాతో కమెడియన్ శ్రీనివాసరెడ్డిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు రాజ్ కిరణ్ ఇప్పుడు మరో కమెడియన్ సత్యం రాజేష్ ను కూడా హీరోగా మారుస్తున్నాడు. గీతాంజలి సినిమాతో దర్శకుడుగా మంచి మార్కులు కొట్టేసిన రాజ్  కిరణ్ తర్వాత స్వాతిరెడ్డితో చేసిన త్రిపుర ఆడలేదు. పైగా ఈ సినిమాకు విమర్శకులు కూడా వచ్చాయి. దీంతో ఈ సారి తనే సొంతంగా రాజ్ కిరణ్ సినిమా పతాకంపై మరో కొత్త సినిమా ఓపెనింగ్ చేశాడు. ఈ సినిమా పేరు విశ్వామిత్ర. గత రెండు సినిమాల్లాగే ఇందులోనూ ప్రధాన పాత్ర లేడీనే. ఫస్ట్ మూవీలో అంజలి, తర్వాత స్వాతిని తీసుకున్న దర్శకుడు ఈ సారి కూడా మరో తెలుగు భామ నందిత రాజ్ ను తీసుకున్నాడు. మేల్ లీడ్ లో సత్యం రాజేష్ నటిస్తున్నాడు..

ఇవాళ ఓపెనింగ్ జరుపుకున్న ఈ విశ్వామిత్ర మూవీ ఓ రియల్ స్టోరీ అంటున్నారు. అది కూడా యూఎస్ లో జరిగిన కథట. అందుకే టైటిల్ కు క్యాప్షన్ కూడా ‘బేస్డ్ ఆన్ అన్ బిలీవబుల్ ట్రు స్టోరీ’అంటూ.. పెట్టాడు. ఒక రకంగా ఇది కూడా ముందు రెండు సినిమాల్లాగే హారర్ జానర్ లో సాగే కథ అని అర్థమౌతోంది. మొత్తంగా గీతాంజలితో శ్రీనివాస రెడ్డికి హీరోగా మంచి బ్రేక్ వచ్చింది. మరి ఇప్పుడు సత్యం రాజేష్ కు కూడా మంచి బ్రేకే వస్తుందా అనేది చూడాలి.

More Related Stories