English   

సెన్సార్ చిక్కుల్లో మ‌ళ్లీ విశ్వ‌రూపం

Vishwaroopam-censor

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ సొంత సినిమా విశ్వ‌రూపం. రెండు భాగాలుగా రావాల్సిన ఈ సినిమాలో ఫ‌స్ట్ పార్ట్ వ‌చ్చి మూడేళ్లు దాటింది. కానీ రెండో భాగం రావ‌డానికి ఎప్పుడూ ఏదో ఒక వివాదం వ‌స్తూనే ఉంది. మొత్తంగా ఈ భాగాన్ని కూడా విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు సెన్సార్ చిక్కుల్లోప‌డిందీ విశ్వ‌రూపం.  నిజానికి మొద‌టి భాగం అప్పుడూ సెన్సార్ నుంచి చాలా ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చాయి. అప్పుడు ఏకంగా దేశం విడిచిపోతాన‌ని ఉద్వేగంగా చెప్పాడు క‌మ‌ల్. మొత్తంగా అప్పుడు చాలా నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య విడుద‌లైన విశ్వ‌రూపంకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మంచి విజ‌య‌మూ సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తోన్న అభిమానులకు పోస్ట్ పోన్స్ ప‌ర్వంతోఏకంగా ఆ సినిమా గురించే మ‌ర్చిపోయేలా చేసింది టీమ్. కానీ ఈ యేడాది ఫైన‌ల్ గా విశ్వ‌రూపం-2ను ముస్తాబు చేశారు. లేటెస్ట్ గా సెన్సార్ కు పంపించారు. మ‌ళ్లీ అక్క‌డ మొద‌లైంది కొత్త వివాదం.

నిజానికి ఓ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇస్తే అదే ఫైన‌ల్. కానీ విశ్వ‌రూపం2కు విచిత్రంగా రెండు స‌ర్టిఫికెట్స్ ఇస్తామంటున్నారు. సౌత్ లో ఈ సినిమాకు క్లిన్ యు స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. కానీ నార్త్ లో యూబై ఏ ఇస్తామంటున్నార‌ట‌. అదెలా కుదురుతుంది.. ఒక సినిమాకు రెండు స‌ర్టిఫికెట్స్ ఇవ్వ‌డం ఏంటీ అంటే.. వేర్వేరు ప్రాంతాల్లో వేరువేరు సంస్కృతులు ఉండ‌టం లేదా. ఇదీ అలాగే.. ఇది ఒక ప్రాంతం ప్రేక్ష‌కుల‌కు బానే ఉండొచ్చు. మ‌రో ప్రాంతం ప్రేక్ష‌కులు ఇబ్బందిప‌డొచ్చు. అందుకే ఇలా డిఫ‌రెంట్ స‌ర్టిఫికెట్స్ అంటూ వితండ వాదం చేస్తున్నార‌ట‌. మరి ఈ గొడ‌వ ఎటు తేలుతుందో కానీ.. విశ్వ‌రూపం2 ను ఈ నెల‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. 

రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై  125కోట్ల బ‌డ్జెట్ తో క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించించారు. తీవ్ర‌వాదం నేప‌థ్యంలో వ‌చ్చే ఈ సినిమాకు అప్పుడు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు వ‌స్తోన్న‌వివాదాలూ సినిమా విజ‌యంలో ఉప‌యోగ‌ప‌డతాయా అనేది చూడాలి.

More Related Stories