English   

కమల్ హాసన్ పై కక్ష కట్టారా..?

Vishwaroopam-2
2018-08-04 16:36:58

లోక నాయకుడు కమల్ హాసన్ పై కక్ష పెంచుకున్నట్టుగా ఉంది కొందరు. అందుకే అదే పనిగా ఆయన సినిమాపై విపరీతమైన నెగెటివ్ ప్రాపగాండా చేస్తున్నారు. లేటెస్ట్ గా విశ్వరూపం -2 సినిమా విడుదలకు అడ్డంకులు అంటూ కొన్ని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. కానీ అందులో నిజం లేదంటోంది రాజ్ కమల్ ఇంటర్నేషనల్(కమల్ సొంత) బ్యానర్. ఇప్పటికే మూడేళ్లు ఆలస్యంగా వస్తోందీ సినిమా. దీంతో కొందరు తమకు సినిమా చేస్తానని మాటిచ్చి.. కమల్ హాసన్ డబ్బులు తీసుకున్నాడని.. అవి చెల్లించేంత వరకూ విశ్వరూపం -2 విడుదలను ఆపాలని కోర్ట్ కు వెళ్లారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. దీని వెనక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని వేరే చెప్పక్కర్లేదు. కానీ ప్రస్తుతం కమల్ ఆ డబ్బులు(6.5కోట్లు అంటున్నారు) ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పైగా ఆ సినిమా రెండు దశాబ్దాల క్రితం అనుకున్న మరుద నాయగం. ఇలాంటి సందర్భంలో ఆ సినిమా ప్రస్తావన తేవడం అంటే దీని వెనక ఎవరున్నారో ఊహించేయొచ్చు. 

ఇక మరోవైపు కమల్ మాత్రం తన సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా విశ్వరూపం-2 సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి ఈ మూవీకి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఇప్పటికే మూవీపై భారీ అంచనాలున్నాయి. మొదటి భాగానికి మించిన ట్విస్టులు ఈ సినిమాలో ఉంటాయని కమల్ చెబుతున్నాడు. మరి అవన్నీ ఎలా ఉన్నా.. రిలీజ్ కు ముందు కమల్ ను ఇరకాటంలో పెట్టడం ఆయనపై కక్ష కట్టినవారు చేస్తోన్న పని అంటున్నారు. ఇలాంటి ఇబ్బందికర సందర్భాల్లో విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయ్.. మరి విశ్వరూపం-2 కూడా విశ్వరూపం చూపిస్తుందేమో చూడాలి. 

More Related Stories