English   

విశ్వరూపం-2  విడుదలతోంది.. నిజం

Vishwaroopam-2

విశ్వరూపం -2కు ఎన్నాళ్లో వేచిన విడుదల వచ్చేసింది. 2014లోనే పూర్తయిన ఈ సినిమా అప్పటి నుంచి ఎప్పుడు వస్తుందో తెలియక ఇన్నాళ్లుగా మూలనపడిపోయి ఉంది. ఫైనల్ గా ఈ మూవీ విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా సెన్సార్ కూడా అయింది. విశ్వరూపం-2కు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చిందంటే విడుదల కావడం పెద్దగా ఆలస్యం కాదేమో. గతంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా మొదలుపెట్టాడు కమల్. ఫస్ట్ పార్ట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు వివాదాలూ వచ్చాయి. జయలలిత ప్రభుత్వం కమల్ ను టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టింది. సినిమా విడుదలకే అనేక అవాంతరాలు వచ్చాయి. దీంతో ఒక దశలో కమల్ దేశం విడిచిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి విశ్వరూపం పార్ట్ -2 కోసం నానా తంటాలూ పడ్డాడు. బడ్జెట్ లేక, షెడ్యూల్స్ అడ్జెస్ట్ కాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులవల్ల, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్ని ఇబ్బందులూ ఈ సినిమాపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ నేపథ్యంలో సినిమాపై కమల్ కూడా ఆశలు వదులుకున్నట్టు కనిపించాడు. ఆడియన్స్ కూడా మర్చిపోయారు. కానీ సడెన్ గా సెన్సార్ అయిందనే వార్త మళ్లీ సెన్షేషన్ అవుతోంది. 

సెన్సార్ అయిన తర్వాత కూడా ఓ స్టార్ హీరో సినిమా విడుదల కాకపోతే అది అవమానం. అందుకే విడుదలకు మరీ ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఏప్రిల్ 13న విశ్వరూపం-2 విడుదల కావొచ్చు. ఇక రీసెంట్ గా గరుడవేగలో రాజశేఖర్ కు జంటగా నటించిన పూజా కుమార్ ఈ సినిమాతోనే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి ఈ సెకండ్ పార్ట్ తర్వాత అమ్మడికి మళ్లీ ఆఫర్స్ పెరుగుతాయోమో చూడాలి. 

More Related Stories