English   

బాహుబలి-2 రికార్డ్ బీట్ చేసిన విశ్వరూపం-2 

Vishwaroopam2-baahubali
2018-08-11 17:14:26

కొన్ని సినిమాలంతే టాక్ తో సంబంధం లేకుండా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి సినిమాల్లో విశ్వరూపం-2 కూడా చేరింది. కమల్ హాసర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఏకంగా బాహుబలి రికార్డ్ నే బీట్ చేసి ట్రేడ్ సర్ ప్రైజ్ చేసింది. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? అందుకే అనేది కొన్ని సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా షాకులు ఇస్తాయని.. ఇంతకీ విశ్వరూపం-2 బీట్ చేసిన బాహుబలి-2 రికార్డ్ ఏంటో తెలుసా.. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్. అంటే బాహుబలి కంటే విశ్వరూపంకే భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టన్నమాట.. 

కమల్ హాసన్, పూజాకుమార్ జంటగా నటించిన విశ్వరూపం వచ్చిన ఐదేళ్లు వచ్చిన సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో కమల్ భారీగా లాస్ అయిపోయాడు. ఫస్ట్ షోకే ఇది కన్ఫ్యూజన్డ్ మూవీ అనే టాక్ వచ్చింది. కానీ ఏ క్రికెటర్ అయినా సొంత మైదానంలో రెచ్చిపోయినట్టు కమల్ హాసన్ చెన్నైలో రెచ్చిపోయాడు. అందుకే చెన్నైలో ఫస్ట్ డే రికార్డ్స్ లో విశ్వరూపం -2 బాహుబలి-2ని బీట్ చేసింది. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో బాహుబలి 92లక్షలు కలెక్ట్ చేసింది. అయితే విశ్వరూపం -2 93లక్షలు వసూలు చేసి బాహుబలిని దాటేసింది. అయితే ఇదే హయ్యొస్ట్ రికార్డ్ కాదక్కడ. విశ్వరూపం-2 ప్లేస్ ఆరు. అంటే దీనికంటే ముందు ఐదు సినిమాలున్నాయన్నమాట. వాటిలో ఫస్ట్ ప్లేస్ కాలా ది. తర్వాత కబాలి, వివేగం, తెరి వంటి సినిమాలున్నాయి..

More Related Stories