English   

ట్రైలర్ తోనే విశ్వరూపం చూపించాడు

viswaroopam trailer
2018-06-12 07:59:06

కమల్ హాసన్ నుంచి సినిమా వచ్చి చాలాకాలమైంది. అలాగే గతంలో చేసిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ కోసం వెయిట్ చేయబట్టి కూడా చాలా కాలమేఅయింది. అసలు వస్తుందా లేదా అన్న డౌట్ నుంచి మొత్తంగా విశ్వరూపం-2కు భారీ కదలిక వచ్చింది. ఇవాళ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సీక్వెల్ ట్రైలర్ విడుదల చేశారు. సింపుల్ గా అద్భుతం అనొచ్చు. కమల్ హాసన్ ఎంత ఫైనెస్ట్ యాక్టర్ అనేది వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాకు ఆయనే దర్శకుడు. తానెంత బ్రిలియంట్ టెక్నీషియన్ అనేది కూడా చూపించాడు. ఇప్పటికే విశ్వరూపంతో వాల్డ్ వైడ్ గా తిరుగులేని అప్రిసియేషన్ తెచ్చుకున్న కమల్ ఈ సారి మరింత డబుల్ డోస్ అందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో కనిపించిన మరో విశేషం ఏంటంటే.. తెలుగు డబ్బింగ్  కూడా కమలే చెప్పడం.. 

 

విశ్వరూపంలో అన్నీ ఉన్నాయి. అలాగే ఈ సీక్వెల్ లోనూ. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ విశ్వరూపం-2కు గ్రాఫికల్ వర్క్ కు సంబంధించిన పని లేటవడం వల్లే ఇన్నేళ్ల గ్యాప్ వచ్చింది. అయితేనే.. ఆ గ్యాప్ కు సంబంధించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అద్భుతమైన ట్రైలర్ తో వచ్చాడు. కళ్లు చెదిరే యాక్షన్ స్టంట్స్, దేశభక్తికి సంబంధించిన డైలాగ్.. ఇక రొమాన్స్, పర్ఫార్మెన్స్.. ఇలా దేంట్లోనూ విశ్వరూపం-2 తక్కువ కాదు అన్నట్టు చూపించాడు. ఇక ఫస్ట్ పార్ట్ లో పూజా కుమార్ ను సాధారణ ఇల్లాలుగా చూపించిన కమల్.. ఈ పార్ట్ లో ఆమె అసలు క్యారెక్టర్ ను రివీల్ చేసినట్టు తెలుస్తోంది. ఓ షాట్ లో పూజా ఇండియన్ ఆర్మీతో కలిసి కూర్చుని ఉంటుంది. దాన్ని బట్టి తనూ ఓ స్పై అయి ఉండొచ్చు. మొత్తంగా కమల్ హాసన్ ట్రైలర్ తోనే విశ్వరూపం చూపించాడు.. ఇక సినిమాలో ఏం తక్కువ ఉండదనుకోవచ్చు. అన్నట్టు చివర్లో రిలీజ్ డేట్ కూడా చెప్పాడు.. ఆగస్ట్ 10. సో విశ్వరూపం-2 వెయిటింగ్ కోసం ఇన్నాళ్ల వెయిటింగ్ ఆగస్ట్ 11తో ఫుల్ స్టాప్ పడుతుందనుకోవచ్చు. 

More Related Stories