English   

స్త్రీలు-శబరిమల వివాదం మీద వివేక్ ఒబరాయ్ సంచలన వ్యాఖ్యలు

vivekobera
2020-05-24 15:31:52

బాలీవుడ్ హీరో వివేక్ ఒబరాయ్ న‌టుడిగానే డబ్బు సంపాదించడమే కాదు, ఆ సంపాదనను మంచి మంచి సామాజిక కార్య‌క్ర‌మాల‌ కోసం వెచ్చించి మరీ మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న స్త్రీలు శబరిమల ఆలయానికి వెళ్లడం విష‌యం మీద స్పందించారు. అయితే శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని తరచూ సందర్శించే ఆయన శ‌బ‌రిమ‌లకు మ‌హిళ‌లు వెళ్ళే విషయం గురించి మాట్లాడుతూ  తన కలలో శబరిమల ఆలయాన్ని చూశానని, 1999 లో తన మామగారి కోరిక మేరకు మొదటిసారి శ‌బరిమల ఆలయాన్ని సందర్శించానని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్లుగా శ‌బరిమల ఆలయాన్ని సందర్శిస్తు వస్తున్నానని వివేక్ పేర్కొన్నారు.

ఆడవారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నానన్న ఆయన మహిళలు శబరిమలకు వెళ్ళడం గురించి కొంద‌రు మాట్లాడుతున్నప్పుడు, దీని గురించి మాట్లాడుతున్న వ్యక్తులు శ‌బరిమలకు ఎన్నడూ రాలేదని మరియు వారికి శబరిమల గురించి తెలియదని భావిస్తానని అన్నారు. గత రెండేళ్లుగా తాను శబరిమల వెళ్ళడం లేదన్న వివేక్ శ‌బ‌రిమ‌ల శక్తి మ‌హిళ‌ల హార్మోన్లు, రుతుస్రావంపై ప్రభావం చూపుతుంద‌ని చాలా‌మంది చెప్పడం విన్నానని అన్నారు. మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా వారికి భవిష్యత్తులో పిల్లలు క‌లిగే విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతా‌యని కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేన‌ని చెప్పడం కొసమెరుపు.

 

More Related Stories