English   

బాలయ్య విలన్ గా కొత్త పేరు  

Vivek oberoi
2020-08-13 13:48:27

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం బోయ‌పాటితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి.

ఈ బాల‌కృష్ణ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోను బోయపాటి మళ్ళీ విలన్ గా నటింప చేస్తున్నారని అంటున్నారు. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు వివేక్ ఒబెరాయ్. వివేక్‌ ఒబెరాయ్‌ గతంలోనే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పుడు బాల‌య్య‌కి విల‌న్‌గా కూడా ఈయన్నే ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లు పెట్టార‌నేది టాక్. ఈయన గతంలో విలన్ గా చేసిన మలయాళం సినిమా లూసిఫర్ కూడా మంచి హిట్ అయింది. ఇక మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.  ఆ మధ్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌దత్‌ని తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ నిన్నటి లంగ్ క్యాన్సర్ దెబ్బకు ఆయన నటించడం డౌటే. 
 

More Related Stories