English   

ప‌రిటాల ర‌వితో రామ్ చ‌ర‌ణ్ వైరం..

Vivek Oberoi  Ram Charan

అదేంటి.. ప‌రిటాల ర‌వితోచ‌ర‌ణ్ కు వైరం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. మెగా వార‌సుడు వెళ్లి వెళ్లి ప‌రిటాల ర‌వితోనే పెట్టుకుంటున్నాడు. కానీ ర‌వి చ‌నిపోయి కూడా చాలా ఏళ్లైపోయింది కదా అనేగా మీ అనుమానం. ప‌రిటాల ర‌వి అంటే ముందుగా గుర్తొచ్చేది ఒరిజిన‌ల్.. ఆ త‌ర్వాత న‌కిలినే. ఆ న‌కిలి ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది క‌దా.. అతడే వివేక్ ఒబేరాయ్. ఈయ‌న తెలుగు సినిమాల్లోకి కూడా వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా న‌టించిన వివేక్.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి అడుగు పెడుతున్నాడు. అది కూడా విల‌న్ రోల్ తోనే. అప్ప‌ట్లో చిరంజీవి ఖైదీ నెం.150లో విల‌న్ రోల్ కోసం వివేక్ ను అడిగితే అనివార్య కార‌ణాల‌తో నో అన్నాడు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలో మాత్రం విల‌న్ గా న‌టించ‌డానికి ఓకే చెప్పాడు వివేక్.

ర‌క్త‌చ‌రిత్ర‌తో ఈయ‌న‌కు తెలుగులో కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ ఈయ‌న్ని అడ‌గ‌లేదు.. ఆయ‌న కూడా బాలీవుడ్ వ‌దిలేసి రాలేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం వ‌చ్చింది. రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలో ఈయ‌న పాత్ర మ‌రీ క్రూరంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. సాధార‌ణంగానే విల‌న్స్ ను చాలా క్రూరంగా చూపించే బోయ‌పాటి.. వివేక్ ఒబేరాయ్ పాత్ర‌ను కూడా అలాగే డిజైన్ చేస్తున్నాడు. ఈ సినిమా గ్యాంగ్ లీడ‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో త‌మిళ హీరో ప్ర‌శాంత్, న‌వీన్ చంద్ర ఇద్ద‌రూ చ‌ర‌ణ్ కు అన్న‌య్య‌లుగా న‌టిస్తున్నారు. గ్యాంగ్ లీడ‌ర్ లోనూ ఇద్ద‌రు అన్న‌ల‌కు ముద్దుల త‌మ్ముడిగా న‌టించాడు మెగాస్టార్. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ అయిపోయింది. మార్చ్ రెండో వారంలో రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది. మ‌రి ఈ చిత్రంతో తెలుగులో వివేక్ కు ఎలాంటి పునాది ప‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories