English   

నాని vs నాగార్జున...ఎవరు వెనక్కి వెళ్తారో ?

Nani Nagarjuna
2019-05-20 09:35:34

నేచుర‌ల్ స్టార్ నాని మొన్ననే జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన కొత్త సినిమాగా గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా తెర‌కెక్కుతుంది, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ దొంగలుగా నటిస్తుండగా ఆయన ఆ దొంగల గ్యాంగ్ కి లీడర్ గా నటిస్తున్నాడు. మరో పక్క నాగార్జున కెరీర్‌ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన మ‌న్మ‌థుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 సిఇమా చేస్తున్నాడు. మార్కెట్ పరంగా ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో విడుద‌ల కానున్నాయనే ప్రచారం ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల‌ వారిని టెన్షన్ లోని నెట్టేసింది. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాని ఇప్పటికే ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జూన్ 30కి షూటింగ్ అంతా పూర్త‌వుతుండగా ఈ సినిమాని రెండు నెలలలో రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేశారు. మరోపక్క నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని ఆగ‌స్ట్ 29న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు. దీంతో రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో రెండు సినిమాలు ఒకే సారి ట్రేడ్ ప్రకారం ఇబ్బందే అని అంటున్నారు. మ‌రి ఈ నేపధ్యంలో  ఏ నిర్మాత‌ త‌మ సినిమాని వాయిదా వేసుకుంటారో చూడాలి.  

More Related Stories