English   

బిగ్ బాస్ రచ్చ...హేమ vs శ్రీముఖి

Hema Sree mukhi
2019-07-26 07:58:12

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో సెలబ్రిటీల మధ్య విబేధాలు ఐదో రోజుకే తారా స్థాయికి చేరుకున్నాయి. నిన్న హేమ-రాహుల్, హేమ-శ్రీముఖి అలాగే వరుణ్ సందేశ్ - మహేష్ విట్టల మధ్య గొడవలు జరిగాయి. షో ప్రారంభంలోనే హేమ, రాహుల్‌ల మధ్య జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించగా ఎవరూ వెనక్కి తగ్గలేదు. రేపు నాగార్జున వస్తారుగా అప్పుడే ఆయనకు చెప్పి తేల్చుకుందాం అని హేమ అనడంతో పక్కనే ఉన్న మహేష్ విట్టా కల్పించుకుని ఆయన లెవల్ ఏంటి? మన పత్తాపారం ఏంటి? ఇంత చిన్న గొడవకి ఆయన పంచాయతీ చేయాలా అంటూ తీసి పారేశాడు. ఆ తర్వత నా చపాతి ముక్క తినేశారని సిల్లీ గొడవ మొదలెట్టింది పునర్నవి. నా చపాతీని ముక్కను అలీ సగం తినేశారని రచ్చ చేసింది పునర్నవి. హేమ వెళ్లి నువ్ చపాతీ తినేశావని వాళ్లు అనుకుంటున్నారని అలీ చెవిన వేయడంతో తిన్నది నేను కాదు. బాబా భాస్కర్ అంటూ అసలు నిజం చెప్పాడు అలీ. బాబా భాస్కర్ వచ్చి కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నానని తనదైన కామెడీ శైలిలో చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లో భాగంగా హేమ, జాఫర్‌లను ఎంపిక చేసుకున్నారు కంటెస్టెంట్స్. ఈ ఇద్దరు గేమ్‌లో సక్సెస్ కావడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ సాధించారు. అయితే లగ్జరీ బడ్జెట్‌ను ఉపయోగించి వారానికి సరిపడా సరుకులను కొనడంతో విఫలం అయ్యారు కంటెస్టెంట్స్. అయితే దీనికి కారణం శ్రీముఖి టైంకి రాకపోవడమే అని హేమ అనడంతో ఆమె మీద ఫైర్ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత మహేష్ విట్ట వరుణ్ తేజ్ భార్య వితికను డోర్ దగ్గర నిలబడి చేయి అడ్డుపెట్టి పో అన్నందుకు వరుణ్ సందేశ్ మహేష్ విట్ట మీద ఫైర్ అయ్యాడు. ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని చేయి చూపిస్తూ మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఏంటి వేలు చూపిస్తున్నావంటూ మహేష్‌ సైతం వరుణ్‌ మీదకు వచ్చాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.. సిగ్గులేనోడా అంటూ వరుణ్‌ ఫైర్‌ అయ్యాడు. దీంతో ఇద్దరూ కొట్టుకోవడానికి సిద్ధమవ్వగా మిగిలిన కంటెస్టెంట్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వివాదం మధ్యలోనే నిన్నటి ఎపిసోడ్‌ ముగిసింది. ఇక నేటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా - వరుణ్ సందేశ్‌ల మధ్య రచ్చ కంటిన్యూ అవనుంది. చూద్దాం ఈరోజు ఎంత రచ్చ జరగనుందో ?
 

More Related Stories