పోలీస్ vs దొంగ ఎవరు నెగ్గుతారో

ఈ ఏడాది చివరి అంకానికి చేరుకుంది. సినిమా వాళ్ళకి ఇంకా మరో సీజన్ మాత్రమే మిగిలి ఉంది. అదే క్రిస్మస్ సీజన్. ఇక ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఒకే తేదిన నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారింది. డిసెంబర్ 20వ తేదీ ఆ రోజున తెలుగులో `రూలర్`, `ప్రతి రోజూ పండగే`, తమిళ్ డబ్బింగ్ `దొంగ`, హిందీ డబ్బింగ్ `దబాంగ్ 3` రిలీజ్ అవుతున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన యాక్షన్ డ్రామా `రూలర్` కి పోటీగా తెలుగు నుండి సాయితేజ్ హీరోగా నటించిన `ప్రతి రోజూ పండగే` రాబోతోంది. ఇక అదే తేదికి కార్తి తమిళ అనువాద చిత్రం `దొంగ` రిలీజ్ కానుండగా… సల్మాన్ ఖాన్ హిందీ డబ్బింగ్ ఫిల్మ్ `దబంగ్ 3` కూడా డిసెంబర్ 20నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ విచిత్ర మైన విషయం ఏంటంటే `రూలర్`, `దబంగ్ 3` కాప్ స్టోరీలతో తెరకెక్కితే, `దొంగ` ఓ దొంగోడి కథతో రూపొందింది. అంటే ఒక రకంగా… పోలీస్, దొంగ మధ్య క్లాష్ లో ఆరోజు ఎవరు నెగ్గుతారో చూడాలి.