English   

మహేష్ బాబు Vsఅల్లు అర్జున్.. మరోమారు వన్స్‌మోరు..

Mahesh Babu Vs Allu Arjun
2020-06-04 20:19:37

2020లో సంక్రాంతిని అద్భుతంగా స్టార్ట్ చేసారు అల్లు అర్జున్, మహేష్ బాబు. ముందు నుంచి కూడా ఈ ఇద్దరి సినిమాలు పండక్కి వస్తున్నాయని తెలిసి పండగ చేసుకున్నారు అభిమానులు. అనుకున్నట్లుగానే రెండూ ఒకరోజు గ్యాప్ లో వచ్చి సంచలన విజయాలు సాధించాయి. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనంత కలెక్షన్ల సునామి సృష్టించాయి 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' సినిమాలు. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 270 కోట్లకు పైగా షేర్.. 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. దాంతో బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. అయితే పోటీ ఎలా ఉన్నా కూడా విడుదల రోజు నుంచి కూడా రికార్డుల గోల కూడా అలాగే నడిచింది. 

ఒకర్ని మించి మరొకరు పోస్టర్లు.. టీజర్లతో రచ్చ చేసుకున్నారు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు టీమ్స్.  అల్లు అర్జున్ ఓ రికార్డు వేసుకుంటే.. మహేష్ మరో రికార్డు వేసుకున్నాడు. చివరి వరకు కూడా ఇలాగే సాగింది ఈ ఇద్దరి వ్యవహారం. అయితే చివరికి ఈ పోరులో అల్లు అర్జున్ కాస్త ముందున్నాడు. ఈయన సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. మరోవైపు సరిలేరు నీకెవ్వరు కూడా మహేష్ బాబు కెరీర్ లోనే అన్ని రికార్డులను తిరగరాసింది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి మహేష్, అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప.. పరశురామ్‌తో మహేష్ సర్కారు వారి పాట సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకేసారి పూర్తి కానున్నాయని తెలుస్తుంది. మహేష్ బాబు తన కథను వద్దన్నాడనే.. కావాలనే సుకుమార్ తన సినిమాను మహేష్ బాబుపై రిలీజ్ చేయడానికి చూస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2018లో 'నా పేరు సూర్య' వచ్చిన సమయంలోనే 'భరత్‌ అనే నేను' వచ్చింది. అప్పుడు మహేష్ ముందున్నాడు. ఆ తర్వాత బన్నీ లెక్క సరిచేసాడు. ఇప్పుడు కూడా 2021 సమ్మర్ లో పరశురామ్‌తో మహేష్ సినిమా.. సుకుమార్‌తో బన్నీ చేస్తున్న సినిమాలు రెండూ ఒకే సమయంలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది.

More Related Stories