English   

వినాయ‌క్ ను వ‌దిలేస్తున్నారా.. వ‌దిలేసాడా..? 

vv vinayak
2018-07-27 10:06:28

ఏమో ఇదే అర్థం కావ‌డం లేదు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో. ఈయ‌న్ని వదిలేస్తున్నారా.. లేదంటే ఈయ‌న వ‌దిలేస్తున్నాడా అనేది క్లారిటీ రావ‌డం లేదు. మ‌రీ ఎంత డిజాస్ట‌ర్లు ఇచ్చినా కూడా ఒక్క ఆఫ‌ర్ కు కూడా నోచుకోలేనంత దారుణ‌మైన ద‌ర్శ‌కుడు అయితే వినాయ‌క్ కాదు. ఎంత పెద్ద ఫ్లాప్ వ‌చ్చినా కూడా వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికీ ఎవ‌రో ఓ హీరో సిద్ధంగానే ఉంటాడు. కానీ ఇంటిలిజెంట్ త‌ర్వాత అస‌లు వివి వినాయ‌క్ సైలెంట్ అయ్యాడు. బాల‌య్య‌తో సినిమా అనౌన్స్ చేసినా కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ కార‌ణంగా అది ఆదిలోనే ఆగిపోయింది. పైగా ఈయ‌న కూడా ఇప్పుడు త‌ర్వాతి సినిమాపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. కావాల‌నే బ్రేక్ తీసుకోవాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. అప్ప‌ట్లో ఈయ‌న సినిమాలు మానేస్తాడ‌నే టాక్ కూడా బాగానే జ‌రిగింది. అందుకే ఇప్ప‌ట్లో వినాయ‌క్ సినిమాలు చేస్తాడా చేయ‌డా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య ఇంటిలిజెంట్ ఆడియో విడుద‌ల వేడుక జ‌రిగిన తీరు చూస్తే ఈయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో అనిపించింది. 

ఎందుకంటే ఈయ‌న‌కు వాళ్ల జిల్లాల్లో అంత ప‌ట్టుంది మ‌రి. ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే వినాయ‌క్ ఇప్ప‌ట్లో సినిమాలు చేసే మూడ్ లో లేన‌ట్లు తెలుస్తుంది. సాయిధ‌రంతేజ్ సినిమాను కూడా పెద్ద‌గా ఆస‌క్తి లేకుండానే పూర్తి చేసాడు వినాయ‌క్. ఊహించ‌ని విధంగా ఈ చిత్రాన్ని కేవ‌లం 45 రోజ‌ల్లోనే తెర‌కెక్కించాడు. ఇదే సినిమా కొంప ముంచిందేమో అనిపిస్తుంది. ఆకుల శివ ఇచ్చిందే ప్ర‌సాదంగా ఏవేవో సీన్స్ పెట్టేసాడు వినాయ‌క్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి ఇమేజ్ త‌గ్గించేసింది. నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నాడ‌నే అనే ఆస‌క్తి రెండింత‌లు చేసింది. ఇప్ప‌టికైతే బాల‌య్య సినిమా త‌ప్ప మ‌రో సినిమా అయితే ఈ ద‌ర్శ‌కుడి చేతిలో లేదు. తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో బాల‌య్య ఈయ‌న్ని ప‌ల‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బోయ‌పాటి శీనుతో సినిమా చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. మ‌రి చూడాలిక‌.. వినాయ‌క్ ఏం చేస్తాడో ఇప్ప‌ట్నుంచీ..?

More Related Stories