English   

పాపం.. ఇప్పుడు బాల‌య్య ప‌రిస్థితి ఏంటి..?

2017-04-01 08:22:50

ఇప్పుడు నంద‌మూరి అభిమానుల్లో ఉన్న కంగారు ఇదే. ఈ మ‌ధ్య కాలంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఉన్న ఫామ్ చూస్తే ఆయ‌న నుంచి అద్భుతాల‌ను ఆశించ‌లేం. దీనికితోడు ఇప్పుడు విడుద‌లైన రోగ్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పూరీ క్రియేటివిటీ మ‌రీ పీక్స్ కు వెళ్లింద‌నే క‌మెంట్స్ వినిపిస్తున్నాయి. ఇష్ట‌మొచ్చిన‌ట్లు సినిమాను తీసాడంటూ తిట్టుకుంటున్నారు నార్మ‌ల్ ఆడియ‌న్స్. ఇలాంటి టైమ్ లో బాల‌య్య సినిమా పూరీ చేతిలో ఉండ‌టం నంద‌మూరి అభిమానుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. 

అలాగ‌ని పూరీని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. పోకిరికి ముందు పూరీ ప‌రిస్థితి ఇంత‌కంటే దారుణంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి సినిమాతో సంచ‌ల‌నం సృష్టిస్తాడో చెప్ప‌లేం..! పోకిరి త‌ర్వాత వ‌ర‌స విజ‌యాలు అందుకుని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌డిపోయాడు. గ‌త 5 ఏళ్ల‌లో టెంప‌ర్, బిజినెస్ మ్యాన్ మిన‌హా పూరీ నుంచి చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు ఈయ‌న బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలాంటి క‌థ‌తో తెర‌కెక్కుతుందో అని అనుకున్నారంతా. కానీ ఇది కూడా గ్యాంగ్ స్ట‌ర్ క‌థే అని తేల్చేసాడు పూరీ. అస‌లే బాల‌య్య‌కు గ‌న్నులు, గ్యాంగ్ స్ట‌ర్లు కొత్త‌. గ‌తంలో కొన్ని సినిమాలు ఈ నేప‌థ్యంలో చేసాడు గానీ పెద్ద‌గా క‌లిసిరాలేదు. మ‌రిప్పుడు పూరీతోనూ అదే చేస్తున్నాడు బాల‌య్య‌. మ‌రి పాపం.. మ‌న నంద‌మూరి నాయ‌కున్ని పూరీ ఏం చేస్తాడో చూడాలిక‌. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ అయిపోయింది.. ఎప్రిల్ 7 నుంచి రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది. సెప్టెంబ‌ర్ 29న బాల‌య్య‌-పూరీ సినిమా విడుద‌ల కానుంది.

More Related Stories