English   

రానాకు ఏమైంది..?

what happend to rana
2018-06-04 07:10:46

రానాకు ఆపరేషన్ జరగబోతోంది. అది కూడా విదేశాల్లో. జిమ్ బాడీతో ఫుల్ స్టిఫ్ గా ఉండే రానాకు ఏమైంది..? అనుకోకండి. అతని కుడి కంటికి ప్రాబ్లమ్ ఉంది. గతంలో ఈ ప్రాబ్లమ్ కు హైదరాబాద్ లోనే సర్జరీ చేయించుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఆ సమస్య అలా ఉండగానే కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాడు. సినిమా అంటే హై ఓల్టేజ్ లైట్స్ ను ఫేస్ చేయాలి కదా. అందుకే సమస్య మరింత పెద్దగా మారుతోంది. పైగా విపరీతమైన పెయిన్ కూడా ఉందట. దీంతో ఇక విదేశాల్లో ఈ కంటికి ఆపరేషన్ చేయించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సురేష్ బాబు స్వయంగా వెల్లడించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రానా. అయినా ఈ సర్జరీ కోసం అన్ని షూటింగ్స్ కు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రానా చేస్తోన్న సినిమాలన్నీ పీరియడ్ ఫిలిమ్స్ కావడం వివేషం. హథీ మేరే సాథీ,1945 అనే హిందీ సినిమాలతో పాటు తెలుగులో రాజా మార్తాండ వర్మ చేస్తున్నాడు.. అలాగే కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. సో.. రానా సర్జరీ సక్సెస్ కావాలని మళ్లీ ఈ ప్రాబ్లమ్ రిపీట్ కాకూడదని మనమూ కోరుకుందాం.. 

More Related Stories