మహేశ్ డైరెక్టర్ కు ఏమైంది..?

ఈ నగరానికి ఏమైందిలా ఇప్పుడు మహేశ్ దర్శకుడికి ఏమైంది అని అడగాలనిపిస్తుంది. ఇంతమంది దర్శకుల్లో ఎవరు ఇప్పుడు మహేశ్ దర్శకుడు అనుకుంటున్నారా..? ప్రస్తుతం సూపర్ స్టార్ తో సినిమా చేస్తోన్న వంశీ పైడిపల్లి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. ఈయనను ఇప్పుడు చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఈ దర్శకుడికి ఏమైంది.. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న వంశీ ఏంటి ఇప్పుడు ఇలా మారిపోయాడు అంటూ షాక్ అవుతున్నారు. సన్నబడ్డాడని తెలుసు కానీ ఇప్పుడు విడుదలైన పిక్స్ చూస్తుంటే మాత్రం ఒకింత భయం కూడా పుడుతుంది. అసలు వంశీ ఏంటి ఇలా మారిపోయాడు.. నిజంగా ఆయన వంశీనేనా కాదా అనే అనుమానాలు వచ్చేంతగా లుక్ మార్చేసాడు వంశీ పైడిపల్లి. లైపో చేయించుకున్నాడా లేదంటే నార్మల్ గానే అంత బరువు తగ్గాడా తెలియడం లేదు. ప్రస్తుతం మహేశ్ సినిమాకు బ్రేక్ దొరకడంతో కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు వంశీ. ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించనున్న అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలకు మహేశ్ తో పాటు వంశీ కూడా వచ్చాడు. ఈ ఫోటోల్లోనే వంశీ లేటెస్ట్ లుక్స్ బయటికి వచ్చాయి. మొహంలో కళ పోయి పీలగా మారిపోయాడు వంశీ పైడిపల్లి. ఒకప్పుడు బొద్దుగా ఉన్నపుడే లడ్డూలా బాగున్నాడు.. ఇప్పుడు సన్నబడినా ఫేస్ లో మునపటి కళ కనిపించడం లేదంటున్నారు అభిమానులు.