English   

మ‌ణిర‌త్నం-చ‌ర‌ణ్ సినిమా అంతేనా..? 

What-Happened-To-Mani-Ratnam-And-Charan-Project
2017-05-09 06:30:58

మ‌ణిర‌త్నం.. ఇండియ‌న్ సినిమా ద‌శ మార్చిన ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. ఈయ‌న సినిమా అంటే ఓ లైబ్ర‌రీ. కొత్త ద‌ర్శ‌కుల‌కు ఈయ‌న సినిమాలే పాఠాలు. మ‌ణిర‌త్నం అంటే అలాంటి ఇమేజ్ ఉంది. కానీ ఎలాంటి ద‌ర్శ‌కుడైనా కొన్నేళ్ళ త‌ర్వాత గాడి త‌ప్ప‌డం గ్యారెంటీ. ఇప్పుడు మ‌ణి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న సినిమాలు ఈ త‌రానికి న‌చ్చ‌ట్లేదు. ఓకే బంగారంతో ప‌దేళ్ళ త‌ర్వాత హిట్ కొట్టినా.. ఈ మ‌ధ్యే మ‌ళ్లీ చెలియాతో విసిగించాడు మ‌ణిర‌త్నం. ఈ సినిమా పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. అక్క‌డ‌క్క‌డా మ‌ణి మెరుపులు మిన‌హాయిస్తే.. మిగిలిన సినిమా అంతా సోది అని తేల్చేసారు ఆడియ‌న్స్.

విసిగించే స‌న్నివేశాలు.. అర్థం ప‌ర్థం లేని హీరో కారెక్ట‌రైజేష‌న్.. అన్నీ చెలియాకు మైన‌స్ అయ్యాయి. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమా కూడా పూర్తిగా ఆగిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు మ‌ణితో సినిమా చేయాలా వ‌ద్దా అనే డైల‌మాలో ఉన్న చెర్రీ.. ఇప్పుడు ఆయ‌న‌తో సినిమా చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మ‌ణిర‌త్నం అంటే ఇప్పుడు గ‌త‌చ‌రిత్రే అనుకోవాలేమో..!

More Related Stories