English   

అస‌లు బ‌న్నీకి క్లారిటీ ఉందా..? 

allu arjun
2018-07-27 10:07:16

వ‌ర‌స‌గా మూడు నాలుగు విజ‌యాలు వ‌చ్చిన‌పుడు ఇంత కూడా గ్యాప్ తీసుకోలేదు అల్లుఅర్జున్. కానీ ఒక్క ఫ్లాప్ వ‌చ్చేస‌రికి పూర్తిగా డీలా ప‌డిపోయాడు. అస‌లు సినిమాలు చేయ‌డం కాదు.. క‌థ‌లు విన‌డం కూడా మానేసాడు. ఈయ‌న ఏం చేస్తున్నాడో.. ఏం చేయాల‌నుకుంటున్నాడో కూడా క్లారిటీ లేదు. క‌నీసం ఆయ‌న‌కైనా నెక్ట్స్ ఏం చేయాల‌నుకుంటున్నాడో క్లారిటీ ఉందో లేదో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే నా పేరు సూర్య విడుద‌లై ఇప్ప‌టికే రెండు నెల‌లు దాటేసింది. ఈ మ‌ధ్య‌లో న‌లుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి బ‌న్నీ త‌ర్వాత సినిమా కోసం. కొర‌టాల శివ అన్నారు.. కానీ అత‌డు నో అనేసి చిరు సినిమాపై వ‌ర్క్ చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ అనుకుంటే ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని చెప్పేసాడు.. ఇక విక్ర‌మ్ కే కుమార్ సినిమా ఫైన‌ల్ అన్నారు.. క‌థ కూడా విని ఓకే అన్నాడని వార్త‌లొచ్చాయి. 

కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆగిపోయింద‌ని తెలుస్తుంది. అన్నీ అయిపోయాయి పూరీ ఇప్పుడు లైన్ లోకి వ‌చ్చాడు. ఈయ‌న‌తో ఇప్ప‌టికే దేశ‌ముదురు.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాలు చేసాడు బ‌న్నీ. ఇప్పుడు మూడోసారి జ‌త‌క‌ట్టే ఆలోచ‌న చేస్తున్నాడు. అయితే పూరీ సొంత క‌థ కాకుండా.. టెంప‌ర్ లా మ‌రో ర‌చ‌యిత ఇచ్చిన క‌థ తీసుకొస్తే చేస్తాన‌ని చెప్పాడ‌ని తెలుస్తుంది. ఎందుకంటే పూరీ ద‌ర్శ‌కుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వ‌లేదు.. రైట‌ర్ గా త‌ప్ప‌. అందుకే మంచి క‌థ దొరికితే చేస్తానంటున్నాడు. అంద‌రికీ సై అంటున్నాడు కానీ ఏ ఒక్క‌రికీ క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. ఈ క‌న్ఫ్యూజ‌న్ లో తాను కూడా క్లారిటీలో లేన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈ అల్లు వార‌బ్బాయి ఒక్క ఫ్లాప్ కే ఇలా అయిపోతే పాపం సాయిధ‌రంతేజ్ లా ఆరు ఫ్లాపులు వ‌స్తే ఏకంగా సినిమాలే మానేస్తాడేమో..?

More Related Stories