English   

రాజ‌మౌళి.. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మేంటి..? 

allu arjun ss rajamouli new movie
2017-05-01 07:26:13

బాహుబ‌లితో రాజ‌మౌళి ఐదేళ్ల య‌జ్ఞం పూర్తైపోయింది. గ‌త 4 రోజులుగా ఇండియ‌న్ బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది బాహుబ‌లి. ఇక రాజ‌మౌళి మాత్రం హాయిగా కుటుంబంతో పాటు భూటాన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో అంద‌రి మ‌దిలోనూ ఒకటే ప్ర‌శ్న వెంటాడుతుంది. రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా ఏంటి..? ఎవ‌రితో ఈయ‌న త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడు..? ఇంత‌కాలం రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ద‌ర్శ‌కుడు మాత్ర‌మే.. కానీ ఇప్పుడు ఆయ‌న రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లోనూ రాజ‌మౌళి ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు కూడా పోటీ ప‌డుతున్నారు.

ఇలాంటి టైమ్ లో ఈయ‌న మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేస్తారా..? ప‌్ర‌స్తుతం వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే రాజ‌మౌళి త‌ర్వాతి సినిమా కూడా తెలుగులోనే ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. చాలా కాలం కింద ఈయ‌న నిర్మాత డివివి దాన‌య్య ద‌గ్గ‌ర అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ సినిమా ఇప్పుడు తెర‌కెక్కిస్తాడ‌ని తెలుస్తోంది. ఇందులో అల్లుఅర్జున్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. డిజే సినిమాతో బిజీగా ఉన్న బ‌న్నీ.. ఒక‌వేళ నిజంగానే రాజ‌మౌళితో సినిమా అంటే లింగుస్వామి, వ‌క్కంతం వంశీ సినిమాల‌ను ప‌క్క‌న‌బెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో..? చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

More Related Stories