English   

శ్రీ రెడ్డి అసలు టార్గెట్ ఏంటి.. 

srireddy

శ్రీ రెడ్డి.. కొన్ని రోజుల క్రితం ఈ పేరు చెబితే టాలీవుడ్ లో చాలామంది భుజాలు తడుముకున్నారు. కొన్నిరోజుల పాటు టాలీవుడ్ కు కునుకు లేకుండా చేసింది. ముఖ్యంగా నాని, కొరటాల శివ, కోన వెంకట్ వారితో సహా ఆమె చేసిన ఆరోపణలు మొత్తం తెలుగు ఆడియన్స్ నే ఆశ్చర్యపరిచాయి. అందులో నిజాలెన్ని ఉన్నాయన్నది ఆరోపణలు చేసిన వారికి, చేయించుకున్న వారికి మాత్రమే తెలుసు. కానీ ఈ ముదురు భామ తర్వాత పవన్ కళ్యాణ్ పై చేసిన కమెంట్స్ తో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో తెలుగులో ఆమె ఉనికిని పట్టించుకునేవారు తగ్గిపోయారు. ఇప్పుడు మీడియా కూడా శ్రీ రెడ్డి మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అమ్మడు రూట్ మార్చింది. ఈ సారి కోలీవుడ్ పై పడింది. తన రేంజ్ ఇక్కడితో ఆగిపోలేదని.. కోలీవుడ్ లోనూ తనకు కొందరు ‘ఆఫర్స్’ ఇస్తామని ‘ఆనందం’ పొందారని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూ ఇప్పుడు కోలీవుడ్ వారిపై ట్వీట్స్ వేస్తూ కొత్త డ్రామాకు ట్వీట్స్ లేపింది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తనకు అవకాశాలు ఇస్తానన్నాడనీ.. ఓ హోటెల్ లో తామిద్దరం కలుసుకున్నామని.. ఆటైమ్ లో సరదాగా గడిపాం కదా అంటూ అయినా ఇచ్చిన మాట మర్చిపోయారా మురుగదాస్ సర్ అంటూ అతన్నే టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ సంచలనమైంది. ఇక ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ పైనా పడింది. అతను కూడా తనను ఓ హోటెల్ లో కలుసుకున్నాడని.. ముందు మంచి మాట్లాడి.. తర్వాత తనతో నీచమైన భంగిమల్లో డ్యాన్సులు చేయించాడని.. కానీ ‘ఇచ్చిన మాట’ నిలబెట్టుకోలేదని విరుచుకు పడింది. మరి ఈ మాటలు కోలీవుడ్ లో ఎలాంటి ప్రభావం చూపుతాయో కానీ.. ఇక్కడ మాత్రం శ్రీ రెడ్డి ఇంకా దిగజారిపోతోంది. తను ఏదో చేయాలనుకుని ఏమీ చేయలేక.. ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో పడిపోయిందనే విషయం తన ట్వీట్స్ చూస్తేనే తెలుస్తోంది. 

ఒకవేళ తను చేస్తోన్న విమర్శలు నిజమే అయినా.. ఇప్పుడు అవి నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. తన స్తాయి అక్కడికి పడిపోయిందిప్పుడు. మరి ఇలాంటి ట్వీట్స్ ద్వారా తను ఏం సాధించాలనుకుంటోందో కానీ.. అసలు తన టార్గెట్ ఏంటో కానీ.. ఇక శ్రీ రెడ్డిని వెండితెరపై చూడ్డం మాత్రం అసాధ్యం అనేది తేలిపోయినట్టే. 

More Related Stories