English   

వేడెక్కుతున్న త‌మిళ రాజ‌కీయాలు.. 

Tamil-Nadu-politics
2018-08-10 18:07:18

త‌మిళ‌నాడులో ఏదైనా అరాచ‌క‌మే. వాళ్ల ప్రేమ‌ను.. కోపాన్ని.. అభిమానాన్ని ఏది త‌ట్టుకోలేం. అన్నీ భ‌రించ‌లేనంత‌గా చూపిస్తుంటారు. ఇప్పుడు త‌మిళ‌నాట రాజ‌కీయ చ‌ద‌రంగం న‌డుస్తుంది. అక్క‌డ సినిమా వాళ్ల రాజ‌కీయాలే ఎక్కువ‌గా న‌డుస్తున్నాయిప్పుడు. జ‌యల‌లిత చ‌నిపోయాక త‌మిళ రాజ‌కీయాలు చుక్కాని లేని నావ‌లా మారిపోయాయి. ఇక ఇప్పుడు క‌రుణానిధి కూడా పోవ‌డంతో పూర్తిగా అనాధ అయిపోయింది త‌మిళ‌నాడు. ఎవ‌ర్నీ న‌మ్మాలో.. ఎవ‌రికి ప‌ట్టం కట్టాలో తెలియ‌ని సందిగ్ధ ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు ఓట‌ర్లు కూడా. ఇలాంటి టైమ్ లో సినిమా వాళ్లు రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెర‌పై న‌టించిన వాళ్లు.. ఇప్పుడు నిజ జీవితంలోకి వ‌చ్చి రాజ‌కీయం చేస్తామంటున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ కొత్త‌పార్టీ పెట్టేసాడు. 

ఇక ర‌జినీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో దిగ‌లేదు. గ‌త కొన్నేళ్లుగా ర‌జినీని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఎంతోమంది ఎన్నో ర‌కాలుగా ట్రై చేస్తున్నారు. చివ‌రికి న‌రేంద్ర‌మోడీ లాంటి వ్య‌క్తి కూడా సూప‌ర్ స్టార్ ద‌గ్గ‌రికి రాయ‌బారిగా వ‌చ్చాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని.. అటువైపు త‌న అడుగు ప‌డ‌ద‌ని చెప్పుకొచ్చాడు ర‌జినీకాంత్. కానీ ఆ త‌ర్వాత త‌నే కొత్త పార్టీ పెడ‌తాన‌ని చెప్పాడు. త‌మిళ‌నాట ఓ ర‌క‌మైన రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింది. అమ్మ మ‌ర‌ణం.. క‌రుణ క‌న్నుమూత‌.. కుర్చీ కోసం శ‌శిక‌ళ‌, ప‌నీర్ సెల్వం పోరు.. ఇలా ఎటూ దిక్కుతోచ‌ని అనాధ‌లా మారిపోయాయి త‌మిళ రాజ‌కీయాలు. ఇప్పుడు గ‌న‌క క‌మ‌ల్, ర‌జినీల్లో ఎవ‌రో ఒక‌రు మ‌న‌సు పెడితే రాజ‌కీయంగా శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. కానీ క‌మ‌ల్, ర‌జినీ మాత్రం రాజ‌కీయాల‌ను కూడా సినిమాల మాదిరే తీసుకుంటున్నారు. 

ర‌జినీ సంగ‌తి ఇలా ఉంచితే ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా రాజ‌కీయాల‌పై చాలా కాలంగా మ‌క్కువ చూపిస్తున్నారు. కానీ విజ‌య్ ని అతడి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ఆపుతున్నాడు. ఇప్ప‌టికే ఓసారి జ‌య‌ల‌లిత పార్టీకి.. మ‌రోసారి క‌రుణానిధికి స‌పోర్ట్ కూడా చేసాడు విజ‌య్. పైగా ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అభిమానులు విజ‌య్ కాబోయే సిఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మ‌రోవైపు అజిత్ ను అమ్మ వార‌సుడిగా చూస్తున్నారు అభిమానులు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు విశాల్ కూడా తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని తెలిపాడు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికి తాను రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే స‌రైన మార్గం అంటున్నాడు ఈ హీరో. ఇలా ఇప్పుడు త‌మిళ‌నాట పెద్ద రాజ‌కీయ చ‌ద‌రంగ‌మే న‌డుస్తుంది. మ‌రి దీనిలో ఎవ‌రు ముందడుగు వేస్తారో..?

More Related Stories