English   

వినాయ‌క్ ను ఇప్పుడు ఎవ‌రు న‌మ్ముతారు..?

vvvinayak
2018-02-21 17:21:19

వివి వినాయ‌క్.. మొన్న‌టి వ‌ర‌కు ఈయ‌న‌తో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఎగిరి గంతేసేవాళ్లు. అఖిల్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఏకంగా చిరంజీవి సైతం వ‌చ్చి వినాయ‌క్ నే న‌మ్ముకుని త‌న 150వ సినిమాను వినాయ‌క్ చేతుల్లో పెట్టాడు. దాన్నిబ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు వినాయ‌క్ రేంజ్ ఏంటి అనేది. కానీ ఇప్పుడు అది క‌నిపించ‌ట్లేదు. అస‌లు వినాయ‌క్ తో సినిమా అంటేనే ఇప్పుడు స్టార్ హీరోల‌కు కూడా వ‌ణుకు పుడుతుంది. ఆయ‌న చేస్తోన్న సినిమాలు అలా ఉన్నాయి మ‌రి. సాయిధ‌రంతేజ్ తో ఈయ‌న చేసిన ఇంటిలిజెంట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా తొలి రోజే నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయింది. ఆ రోజు నుంచే సినిమా ప‌థ‌నం మొద‌లైంది. దాంతో ఇప్పుడు వినాయ‌క్ నెక్ట్స్ ఏంటి అనేదానిపై అంద‌రి దృష్టి ప‌డింది. 
అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనే అనుమానం కూడా వ‌స్తుందిప్పుడు. ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం చూస్తుంటే వినాయ‌క్ ఇప్ప‌ట్లో సినిమాలు చేసే మూడ్ లో లేన‌ట్లు తెలుస్తుంది. సాయిధ‌రంతేజ్ సినిమాను కూడా పెద్ద‌గా ఆస‌క్తి లేకుండానే పూర్తి చేసాడు వినాయ‌క్. ఊహించ‌ని విధంగా ఈ చిత్రాన్ని కేవ‌లం 45 రోజ‌ల్లోనే తెర‌కెక్కించాడు. ఇదే సినిమా కొంప ముంచిందేమో అనిపిస్తుంది. ఆకుల శివ ఇచ్చిందే ప్ర‌సాదంగా ఏవేవో సీన్స్ పెట్టేసాడు వినాయ‌క్. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి ఇమేజ్ త‌గ్గించేసింది. నెక్ట్స్ ఏం చేయ‌బోతున్నాడ‌నే అనే ఆస‌క్తి రెండింత‌లు చేసింది. ఇప్ప‌టికైతే ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాన‌ని అనౌన్స్ చేసాడు. మ‌రి చేస్తాడో.. ఇప్పుడున్న ఫామ్ చూసి ఎన్టీఆరే వ‌ద్దంటాడో మాత్రం తెలియ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. వినాయ‌క్ త‌ర్వాతి సినిమా ఎలా ఉండ‌బోతుందో.. ఎవ‌రితో ఉండ‌బోతుందో..?

More Related Stories