English   

అల్లు అర్జున్, కొరటాల శివ.. నెక్ట్స్ ఏంటీ..?

allu-arjun

నెక్ట్స్ ఏంటీ.. ఇది ప్రతి హీరోకు, దర్శకుడికి రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆన్సర్ లేనప్పుడు ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడేసుకుంటారు. అది కూడా ఒక రేంజ్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇండస్ట్రీలో ఒక రేంజ్ వచ్చే వరకే ఎవరూ పట్టించుకోరు. కానీ రేంజ్ వచ్చిందా.. ఇక వాళ్లేం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తుంటారు. ఇ రేంజ్ మరీ పెద్దదైతే కొత్త డౌట్స్ కూడా వస్తుంటాయి. డౌట్స్ సంగతి పక్కన బెడితే ఇప్పుడు ఇద్దరు స్టార్స్ పై టాలీవుడ్ లో ఆరాలు మొదలయ్యాయి. 

అయితే ప్రస్తుతం భారీ హిట్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. కానీ ఆయన మాత్రం కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. మరి రెస్ట్ తర్వాతైనా ఓ సినిమా స్టార్ట్ చేయాలి కదా.. అదే ఎవరితో అంటే మాత్రం ఇంకా తెలియదంటున్నాడు. మరి ఇంత డిమాండ్ ఉన్న దర్శకుడు నెక్ట్స్ సినిమా ఏంటో తెలియదు అంటే నమ్మాలా.. నమ్మగలమా..?అంటే అతను తర్వాత ఎవరితో చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడప్పుడే చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. లేదంటే తను అనుకున్న కథలో హీరో కోసం వెదుకుతూ ఉండవచ్చు. బట్ నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న ఆయన చెప్పే వరకూ వస్తూనే ఉంటుందనేది నిజం.

ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఇలాంటి క్వశ్చనే. బన్నీ కూడా కామ్ గా ఉన్నాడు. నిజానికి ఇలాంటి స్ట్రాటజీ బన్నీ కొన్నాళ్లుగా ఫాలో అవుతున్నాడు. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా అంటూ. కానీ ఇతర హీరోలంతా స్పీడ్ మీదున్నారు. కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నెక్ట్స్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం కొరటాల ఖాళీగానే ఉన్నాడు కాబట్టి ఆయనతో చేస్తున్నాడనే మాటలు వినిపించాయి. తర్వాత వేదంతో బన్నీలో యాక్టర్ కు చూపించిన క్రిష్ తో కూడా ఉండొచ్చు అంటున్నారు. మరోవైపు విక్రమ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఎన్ని వినిపించినా వీటిలో ఏది నిజమో వాళ్లు చెప్పే వరకూ అవి రూమర్స్ గానే ఉంటాయి. ఏదేమైనా ఇద్దరు స్టార్స్ ఇలా నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఉండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. 

More Related Stories