English   

ప‌వ‌న్ వెన‌క ఉన్న‌ది ఎవ‌రు..?

Pawan-kalyan
2018-04-23 07:05:51

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సైలెంట్. ఆయ‌న ఎప్పుడూ బ‌య‌టికి రారు.. ఎప్పుడూ ఎవ‌రితోనూ గొడ‌వ‌ల‌కు దిగ‌రు.. ఎంత రెచ్చ‌గొట్టినా మౌనంగానే భ‌రిస్తూ ఉంటారు. బ‌ల‌వంతుడే భ‌రిస్తాడు.. భ‌రించండి అంటూ అభిమానుల‌కు కూడా స‌ల‌హాలు ఇస్తుంటాడు ప‌వ‌ర్ స్టార్. కానీ అలాంటి ప‌వ‌న్ ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. అస‌లు ముందు వెన‌క చూడ‌కుండా మీడియా సంస్థ‌ల‌పై యుద్ధానికి దిగాడు. టివి 9తో పాటు ఏబిఎన్ పై ట్విట్ట‌ర్ లో మామూలుగా ఆడుకోవ‌ట్లేదు. రోజూ ఏదో ఒక‌టి లీక్ చేస్తూ.. బ‌య‌ట‌పెడుతూ వాళ్ల బండారాన్ని బ‌య‌ట‌పెడుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్పుడు కూడా ర‌విప్ర‌కాశ్ వీడియో ఒక‌టి విడుద‌ల చేసాడు ప‌వ‌న్. అందులో ర‌విప్ర‌కాశ్ కాళ్లు ఒక‌త‌ను ప‌ట్టుకుని వేడుకుంటున్నాడు. ఈ పేద‌వాడు ఎందుకు నీ కాళ్లు ప‌ట్టుకున్నాడో కొంచెం చెప్తావా ర‌వి అంటూ ప్ర‌శ్నించాడు ప‌వ‌ర్ స్టార్. 
ఇక మ‌రోవైపు ఆర్కేను కూడా వ‌ద‌ల‌ట్లేదు ప‌వ‌ర్ స్టార్. గుడ్ మార్నింగ్  అంటూ రాసుకొచ్చాడు. ఈయ‌న తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో ఇది ఆగేలా లేదు. ఇదంతా చేయ‌డానికి ప‌వ‌న్ వెన‌క ఉన్న‌ది ఎవ‌రు..? ఆయ‌న ఒక్క‌డే ఉన్నాడా లేదంటే వెన‌క ఎవ‌రైనా ఉన్నారా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపిస్తుంది. దీనివెన‌క ఓ పెద్ద స్థాయి వ్య‌క్తి ఉన్నాడ‌ని.. ఆయ‌న కేంద్రంలో ఉంటాడ‌ని.. ఆయ‌న అండ చూసుకునే ఇప్పుడు ప‌వ‌న్ ఇలా ఆడేసుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఆ పెద్ద‌మ‌నిషి ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదేమో..? ఎందుకంటే ప‌వ‌న్ కు కేంద్రంలో ఉన్న దోస్త్ ఒక్క‌రే. ఆయ‌న అడిగితే ఏదైనా చేసే స్నేహితుడు ఆయ‌న‌. అత‌డి అండ‌తోనే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ఇంత‌గా రెచ్చిపోతున్నాడ‌ని తెలుస్తుంది. 

More Related Stories