English   

సాయి కెరీర్ ను న‌డిపిస్తున్న‌ది ఎవ‌రు..?

Sai-Dharam-Tej

ఒక్క ఫ్లాప్ వ‌స్తేనే ఇండ‌స్ట్రీలో ప‌ట్టించుకోరు. కొన్నిసార్లు వార‌స‌త్వం ఉన్నా కూడా కొంద‌రు వార‌సులు అలాగే మాయ‌మైపోయారు. అలాంటిది ఇప్పుడు సాయిధ‌రంతేజ్ విష‌యంలో మాత్రం ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాలితో ఉన్నారు. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే క‌రుణాక‌ర‌ణ్ తో చేస్తోన్న తేజ్ ఐ ల‌వ్ యూ షూటింగ్ పూర్తి అయింది. జూన్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇక గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా క‌మిట‌య్యాడు సాయిధ‌రంతేజ్. ఈ సినిమా జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. మెడిక‌ల్ మాఫియా నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. గ‌తంలో ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన విన్న‌ర్ డిజాస్ట‌ర్ అయింది. అయినా కూడా మ‌రో ఛాన్స్ ఇచ్చాడు సాయి. ఇక మారుతి కూడా మ‌నోడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు మైత్రి మూమీ మేక‌ర్స్ తో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాని కాద‌నుకున్న సినిమా ఇప్పుడు సాయి చేతుల్లోకి వ‌చ్చింది. దీనికి తోడు ఇప్పుడు ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల సైతం సాయికి ఓ క‌థ చెప్పాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం నితిన్ కోసం క‌థ సిద్ధం చేస్తోన్న వెంకీ.. త‌ర్వాత సాయి కోసం పెన్ను ప‌ట్ట‌నున్నాడు. మొత్తానికి వ‌ర‌స‌గా ఇన్నేసి సినిమాలు చేస్తున్నాడు సాయి. మ‌రి ఇందులో ఏది ఈయ‌న కెరీర్ ను నిల‌బెడుతుందో చూడాలిక‌..!

More Related Stories